ప్రెస్‌మీట్‌లో లోహిత్, రాహుల్ నె్రహ్రా, జయేశ్ రంజన్...లతో శోభన
‘విక్రమ్’ సినిమాతో పరిచయమై దాదాపు అందరి టాప్ యాక్టర్స్‌తో నటించిన నాయిక శోభన. యాక్టర్ నుంచి ఇప్పుడు మరో కొత్త రూపంలో ప్రేక్షకులకు చేరువ కానున్నారు. జాదూజ్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న ఆమె ఇప్పుడు తెలంగాణ పభుత్వ ‘టి.ఫైబర్’తో కలసి రంగారెడ్డిలోని తూములూరు గ్రామంలో జాదూజ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ‘‘సినిమాను మారుమూల ప్రాంతాలకు విస్తరింపజేసే అద్భుతమైన కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకు చేరువ కావడం హ్యాపీ. ఇదొక విప్లవం కానుంది’’ అన్నారు శోభన.
‘‘జాదూజ్ ద్వారా గ్రామీణులకు విజ్ఞానంతోపాటు వినోదం అందించనున్నాం’’ లోహిత్ అన్నారు. ‘‘తొలి విడతగా 8వేల గ్రామాల్లో 500 జాదూజ్ సెంటర్లు నెలకొల్పుతాం. సినిమాలు ప్రదర్శిస్తాం. ఈ సెంటర్స్‌లో ‘చాయ్ నాస్తా కేఫ్‌లు’ ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా వంద మిలియన్ డాలర్స్ (సుమారు 700 కోట్లు) ఆదాయంతో పాటు 5 వేల మందికి ఉపాధి దొరుకు తుంది’’ అన్నారు రాహుల్ నెహ్రా. ‘‘సామాన్యులకు దూరమైన సినిమాను దగ్గర చేయడానికి కృషి చేస్తున్న ‘జాదూజ్’ని అభినందిస్తు న్నా’’ అని తెలంగాణ ఐటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. ‘‘ఈ కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరించడం సంతోషం’’ అని శ్రీధర్‌రావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment