Lohith
-
పిల్లలకోసం అక్షరం...
అక్షరం తెలిస్తే సమాజంలో ఎక్కడైనా బతకొచ్చు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే క్రమంలో మన ప్రభుత్వాలు విద్యకు పెద్దపీట వేస్తున్నాయి. పిఎల్ క్రియేషన్స్ పతాకంపై మిమిక్రీ కళాకారునిగా 7000 ప్రదర్శనలిచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వర ల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాందించిన నటుడు లోహిత్ నిర్మాతగా మారి ‘అక్షరం’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ప్రముఖ నటుడు జాకీ తోట ఈ చిత్రానికి దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్‌ను, ఫస్ట్ లుక్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. జాకీ మాట్లాడుతూ– ‘‘నేను మొదటిసారిగా దర్శకత్వం చేసిన చిత్రం ఇది. సినిమా బాగా వచ్చింది. ప్రతి పేక్షకుడు చూడాల్సిన చిత్రం ‘అక్షరం’’ అన్నారు. లోహిత్ మాట్లాడుతూ– ‘‘విద్యావవస్థలో ఉన్న లోపాలను చూపించే సినిమా ఇది. జాకీగారు సినిమా గురించి చెప్పినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాకి పరుచూరిగారు ఇచ్చిన సూచనలు మర్చిపోలేనివి’’ అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘అందరినీ ఆలోచింప చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. పిల్లల కోసం పేరెంట్స్ ఎంత కష్టపడతారో, వారి భవిష్యత్ కోసం ఏమేం చేస్తారో తెలిపే చిత్రమే ‘అక్షరం’’ అన్నారు. -
సినీ రంగంలో ఇది విప్లవం
‘విక్రమ్’ సినిమాతో పరిచయమై దాదాపు అందరి టాప్ యాక్టర్స్‌తో నటించిన నాయిక శోభన. యాక్టర్ నుంచి ఇప్పుడు మరో కొత్త రూపంలో ప్రేక్షకులకు చేరువ కానున్నారు. జాదూజ్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న ఆమె ఇప్పుడు తెలంగాణ పభుత్వ ‘టి.ఫైబర్’తో కలసి రంగారెడ్డిలోని తూములూరు గ్రామంలో జాదూజ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ‘‘సినిమాను మారుమూల ప్రాంతాలకు విస్తరింపజేసే అద్భుతమైన కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకు చేరువ కావడం హ్యాపీ. ఇదొక విప్లవం కానుంది’’ అన్నారు శోభన. ‘‘జాదూజ్ ద్వారా గ్రామీణులకు విజ్ఞానంతోపాటు వినోదం అందించనున్నాం’’ లోహిత్ అన్నారు. ‘‘తొలి విడతగా 8వేల గ్రామాల్లో 500 జాదూజ్ సెంటర్లు నెలకొల్పుతాం. సినిమాలు ప్రదర్శిస్తాం. ఈ సెంటర్స్‌లో ‘చాయ్ నాస్తా కేఫ్‌లు’ ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా వంద మిలియన్ డాలర్స్ (సుమారు 700 కోట్లు) ఆదాయంతో పాటు 5 వేల మందికి ఉపాధి దొరుకు తుంది’’ అన్నారు రాహుల్ నెహ్రా. ‘‘సామాన్యులకు దూరమైన సినిమాను దగ్గర చేయడానికి కృషి చేస్తున్న ‘జాదూజ్’ని అభినందిస్తు న్నా’’ అని తెలంగాణ ఐటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. ‘‘ఈ కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరించడం సంతోషం’’ అని శ్రీధర్‌రావు అన్నారు. -
నేను పెద్ద స్టార్ అవుతానన్నారు
‘‘టి. కృష్ణగారి ‘దేశంలో దొంగలుపడ్డారు’ సినిమాలో వేషం కోసం వెళ్లా. ‘నీ ఫేస్ కామెడీగా ఉంటుంది.. పైగా చిన్నపిల్లాడివి.. నువ్వు చచ్చిపోయే పాత్ర చేస్తే జనాలు నవ్వుతారు.. వద్దు.. అన్నారు. ‘ఏ రోజుకైనా ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు’ అని ఆయన తన స్నేహితులతో ఆ రోజే చెప్పారట’’ అని నటుడు అలీ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్, రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో రమా గౌతమ్ నిర్మించిన ఈ సినిమాకి అలీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘టి.కృష్ణగారి స్నేహితుడు నాగేశ్వరరావుగారు ముత్యాల సుబ్బయ్యగారి దర్శకత్వంలో తీసిన ‘అమ్మాయి కాపురం’ సినిమాకు నాకు ఉత్తమ కథానాయకుడిగా అవార్డు వచ్చింది. ‘దేశంలో దొంగలుపడ్డారు’ కోసం కొన్నాళ్లు భోజనం కూడా సరిగా లేకుండా పని చేశానని నా తమ్ముడు ఖయ్యూమ్ చెప్పాడు. వాడి కోసమే ఈ సినిమా చూశా. గౌతమ్ రాజ్‌కుమార్ కొత్త దర్శకుడైనా తనని చూస్తే 30 ఏళ్లకు ముందు రామ్‌గోపాల్ వర్మను చూసినట్టు అనిపించింది’’ అన్నారు. ‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ, సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ తెరకెక్కించాం. విడుదలకు ముందే మా సినిమా బ్లాక్ బెర్రీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కి వెళ్లడం సంతోషంగా ఉంది’’ అన్నారు గౌతమ్ రాజ్‌కుమార్. ఖయ్యూమ్, సహ నిర్మాత సంతోష్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయికుమార్ పాలకుర్తి, సహ నిర్మాతలు: సంతోష్ డొంకాడ, సెలెట్ కనెక్ట్స్. -
అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో...
‘‘స్టార్ హీరోలు ఉన్న సినిమాలనే చూడాలని ఇప్పటి ప్రేక్షకులు అనుకోవడంలేదు. కొత్త కథలతో వచ్చే సినిమాలనూ ఆదరిస్తున్నారు. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని కాకుండా బాగున్న సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు నిదర్శనం ‘క్షణం, పెళ్లి చూపులు, ఆర్ఎక్స్ 100’ వంటి చిత్రాలు. మా ‘దేశంలో దొంగలు పడ్డారు’ చిత్రం ఈ కోవకు చెందినదే’’ అని గౌతమ్ రాజ్‌కుమార్ అన్నారు. ఖయూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీరాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రలలో రమా గౌతమ్ నిర్మించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. గౌతమ్ రాజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూఎస్‌లోని మిల్‌ఫోర్డ్‌లో జరగనున్న ‘బ్లాక్ బీర్’ ఫిల్మ్ ఫెసివల్‌కి ఎంపికైంది. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తీసిన చిత్రం ఇది. అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందిన బ్లాక్ బీర్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అధికారికంగా నామినేట్ కావడం హ్యాపీగా ఉంది. అక్టోబర్‌లో జరిగే ఈ చిత్రోత్సవాల్లో పలు అంతర్జాతీయ చిత్రాల మధ్య మా సినిమా ప్రదర్శితం అవుతుంది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: సాయికుమార్ పాలకూరి, సహ నిర్మాత: సంతోష్ డొంకాడ. -
దొంగలు వస్తున్నారు
ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీ రాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రల్లో గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. సారా క్రియేషన్స్ పతాకంపై రమా గౌతమ్ నిర్మించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని, సెన్సార్‌కి రెడీ అయింది. ఈ సందర్భంగా రమా గౌతమ్ మాట్లాడుతూ – ‘‘లొకేషన్స్ కథకు, కథనానికి బలాన్ని చేకూర్చాయి. శేఖర్ గంగనమోని కెమెరా వర్క్ హైలైట్. పూరి జగన్నాథ్ గారు రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత మంచి స్పందన రావడం ఈ మధ్య కాలంలో అరుదు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శాండీ, సహ నిర్మాత: సంతోష్ డొంకాడ. -
లోహిత్‌కు మూడో స్వర్ణం
పుణే: జాతీయ సబ్‌జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ ఎం.లోహిత్ మూడో స్వర్ణాన్ని సాధించాడు. గురువారం జరిగిన గ్రూప్–1 బాలుర 50మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లో లోహిత్ విజేతగా నిలిచాడు. అంతకుముందు 100మీ., 200మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లలోనూ లోహిత్ పసిడి పతకాలను గెలుచుకున్నాడు. మరోవైపు గ్రూప్–4 బాలుర 50మీ. బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో ఏపీకే చెందిన ఎం. తీర్ధు సోమదేవ్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. బుధవారం జరిగిన 50మీ. బటర్‌ఫ్లయ్ విభాగంలోనూ సోమదేవ్ విజేతగా నిలిచాడు. -
ఏపీ స్విమ్మర్లకు రెండు స్వర్ణాలు
పుణే: జాతీయ సబ్ జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండు స్వర్ణాలు, తెలంగాణకు ఒక కాంస్యం లభించాయి. గ్రూప్–4 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో తీర్ధు సామదేవ్ (ఆంధ్రప్రదేశ్)... గ్రూప్–1 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ఎం.లోహిత్ (ఆంధ్రప్రదేశ్) పసిడి పతకాలు గెలిచారు. సామదేవ్ 33.30 సెకన్లలో... లోహిత్ 2 నిమిషాల 23.95 సెకన్లలో తమ రేసులను పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందారు. గ్రూప్–2 బాలుర 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో తెలంగాణ స్విమ్మర్ వై. జశ్వంత్ రెడ్డి 1ని:03.92 సెకన్లలో రేసును ముగించి కాంస్యం గెలిచాడు. -
చూడగానే ఇంప్రెస్ అయ్యా
‘‘దేశంలో దొంగలు పడ్డారు’ టైటిల్ ఆలోచింపజేసేలా ఉంది. టీజర్ నచ్చింది. చూడగానే ఇంప్రెస్ అయ్యా. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి యూనిట్‌కి మంచి పేరు, డబ్బులు రావాలి’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్ రాజన్ జంటగా షానీ, పృథ్వీ రాజ్, సమీర్, లోహిత్ ముఖ్య తారలుగా గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో రమా గౌతమ్ నిర్మించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. ఈ సినిమా టీజర్‌ని పూరి ఆవిష్కరించారు. గౌతమ్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. ఉమెన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ తీశాం. ప్రస్తుత సమాజంలో జరుగుతోన్న విషయాలను ప్రస్తావించా. కథలో అన్ని ఎమోషన్స్ డిఫరెంట్ డైమెన్షన్లో కనిపిస్తాయి’’ అన్నారు. ‘‘క్రైమ్ జానర్లో కొత్త అనుభూతినిచ్చే చిత్రమిది. త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు రమా గౌతమ్. చిత్ర సహనిర్మాత సంతోష్ డొంకాడ, నటుడు ఖయ్యూమ్ పాల్గొన్నారు. -
దేశంలో దొంగలు
ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృధ్విరాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో సారా క్రియేషన్స్‌పై రమాగౌతమ్, కార్తికేయ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. గౌతమ్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. ఉమెన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ తెరకెక్కించాం. కథలో రొమాన్స్‌కు ప్రాధాన్యత ఉంది. సినిమా యువతకు బాగా చేరువవుతుంది. క్రైమ్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌లో ఎవ్వరూ చేయని లోకేషన్లలో చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘కథకు తగ్గ మంచి నటీనటులు కుదిరారు. క్రైమ్ జోనర్లో కొత్త అనుభూతినిచ్చే చిత్రమిది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఈనెలలో టీజర్, జూన్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు కార్తికేయ. ఈ చిత్రానికి కెమెరా: శేఖర్ గంగనమోని, సంగీతం: శాండీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కరుణాకర్, లైన్ ప్రొడ్యూసర్: సాయికుమార్ పాలకూరి, సహ నిర్మాత: సంతోష్ డొంకాడ. -
నెలలో ఒకరోజు ఫ్రీ వెహికిల్ డే
లోహిత్: ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు అమలు చేసిన సరి,బేసి విధానం అమలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నెలలో ఒక రోజు వాహనాలను వాడకుండా ఉండాలని అరుణాచల్ ప్రదేశ్ లోని లోహిత్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణయించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రతీ నెల ఏడవ తేదీన ఫ్రీ వెహికిల్ డే ను పాటించాలని నిర్ణయించారు. ఈ రోజు నడక, సైకిల్ పై గానీ ప్రయాణించాని నిర్ణియించారు. ఇందుకోసం ఎవరిని ఒత్తిడి చేయదలచుకోలేదని పర్యావరణం కోసం ప్రతి ఒక్క ఉద్యోగి స్వచ్చందంగా ముందుకు రావాలని లోహిత్ డిప్యూటీ కమిషనర్ దానిష్ అష్రఫ్ ఆదివారం తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రతీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి దీనిని పాటించాలని అష్రఫ్ కోరారు. -
నువ్వు నడిచిన దారిలో...
విషురెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ ప్రసాద్ నల్లపాటి నిర్మిస్తున్న ‘నువ్వు నడిచిన దారిలో’ చిత్రం హైదరాబాద్ లోని సాయిబాబా మందిరంలో ప్రారంభమైంది. జరుగుల రామారావు దర్శకుడు. తొలి సన్నివేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘రెండు విధాలుగా ప్రవర్తించే రెండు ప్రేమ జంటల కథ ఇది. వారి ప్రవర్తన తాలూకు పర్యవసనాలేమిటి? అనేది ప్రధానాంశం. వినోదంతో పాటు చిన్న సందేశం ఉన్న చిత్రం’’ అన్నారు. పల్లె, పట్టణ, నగర ప్రేక్షకులతో పాటు ప్రవాసాంధ్రులను కూడా మెప్పించే విధంగా ఈ చిత్రం ఉంటుందని, మంచి చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం కావడం ఆనందంగా ఉందని ప్రసాద్ తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లోహిత్ మాట్లాడుతూ - ‘‘నిర్మాణ బాధ్యతలు మాత్రమే కాకుండా ఇందులో ఓ మంచి పాత్ర చేస్తున్నాను. బాధ్యతతో కూడిన ప్రేమ, బాధ్యతారహితమైన ప్రేమకు మధ్య గల వ్యత్యాసాన్ని చూపించే చిత్రం’’ అన్నారు. నందు, ఆదర్శ్, ప్రియ, సందీప్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తిరుపతిరెడ్డి, సంగీతం: గణేష్-రాజ్.