
పుణే: జాతీయ సబ్ జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండు స్వర్ణాలు, తెలంగాణకు ఒక కాంస్యం లభించాయి. గ్రూప్–4 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో తీర్ధు సామదేవ్ (ఆంధ్రప్రదేశ్)... గ్రూప్–1 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ఎం.లోహిత్ (ఆంధ్రప్రదేశ్) పసిడి పతకాలు గెలిచారు.
సామదేవ్ 33.30 సెకన్లలో... లోహిత్ 2 నిమిషాల 23.95 సెకన్లలో తమ రేసులను పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందారు. గ్రూప్–2 బాలుర 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో తెలంగాణ స్విమ్మర్ వై. జశ్వంత్ రెడ్డి 1ని:03.92 సెకన్లలో రేసును ముగించి కాంస్యం గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment