
గచ్చిబౌలి: తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 2వ ఆల్ ఇండియా ఇంటర్ క్లబ్ వాటర్ పోలో చాంపియన్ షిప్ పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వెస్ట్రన్‌రైల్వే మొదటి బహుమతి అందుకుంది. రెండో బహుమతి ఇండియన్ నేవీ, మూడవ బహుమతి ఆర్మీ రెడ్ జట్లు అందుకున్నాయి.
విజేతలకు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ ప్యాట్రన్ కొండా విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment