తనిష్క్ రాజన్
‘‘స్టార్ హీరోలు ఉన్న సినిమాలనే చూడాలని ఇప్పటి ప్రేక్షకులు అనుకోవడంలేదు. కొత్త కథలతో వచ్చే సినిమాలనూ ఆదరిస్తున్నారు. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని కాకుండా బాగున్న సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు నిదర్శనం ‘క్షణం, పెళ్లి చూపులు, ఆర్‌ఎక్స్ 100’ వంటి చిత్రాలు. మా ‘దేశంలో దొంగలు పడ్డారు’ చిత్రం ఈ కోవకు చెందినదే’’ అని గౌతమ్ రాజ్‌కుమార్ అన్నారు. ఖయూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీరాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రలలో రమా గౌతమ్ నిర్మించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’.
గౌతమ్ రాజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూఎస్‌లోని మిల్‌ఫోర్డ్‌లో జరగనున్న ‘బ్లాక్ బీర్’ ఫిల్మ్ ఫెసివల్‌కి ఎంపికైంది. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తీసిన చిత్రం ఇది. అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందిన బ్లాక్ బీర్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అధికారికంగా నామినేట్ కావడం హ్యాపీగా ఉంది. అక్టోబర్‌లో జరిగే ఈ చిత్రోత్సవాల్లో పలు అంతర్జాతీయ చిత్రాల మధ్య మా సినిమా ప్రదర్శితం అవుతుంది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: సాయికుమార్ పాలకూరి, సహ నిర్మాత: సంతోష్ డొంకాడ.
Comments
Please login to add a commentAdd a comment