అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లాడిన దర్శకుడు.. స్టార్‌ హీరో పోస్ట్ వైరల్! | Kartik Aaryan attends Satyaprem Ki Katha director wedding Goes Viral | Sakshi
Sakshi News home page

Kartik Aaryan: 'సెట్స్‌లో మీ ప్రేమ కథను కళ్లారా చూశా'.. కార్తీక్ ఆర్యన్ పోస్ట్ వైరల్!

Published Mon, Jul 1 2024 7:11 PM | Last Updated on Mon, Jul 1 2024 7:49 PM

Kartik Aaryan attends Satyaprem Ki Katha director wedding Goes Viral

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్‌ సమీర్ విద్వాన్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్ జూలీ సోనాల్కర్‌ను ఆయన పెళ్లాడారు. గతేడాది సత్య ప్రేమ్ కి కథ మూవీతో హిట్ కొట్టిన సమీర్ విద్వాన్స్ తాజాగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట జూన్ 29న మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. తాజాగా  వీరి పెళ్లికి బాలీవుడ్‌ హీరో కార్తీక్ ఆర్యన్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.  

marriage

కార్తీక్‌ తన ఇన్‌స్టాలో రాస్తూ..' సత్యప్రేమ్ కి కథ సెట్స్‌లో మీ లవ్ స్టోరీని చూశా. ఈ రోజు మీ అందమైన ప్రయాణంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. నూతన జంటకు నా అభినందనలు.' అంటూ రాసుకొచ్చారు. కాగా..  సత్యప్రేమ్ కి కథ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించారు. ‍అయితే వీరి పెళ్లికి హీరోయిన్ కియారా అద్వానీ హాజరు కాలేదు. కాగా.. సమీర్ విద్వాన్స్ ప్రస్తుతం మరాఠీ చిత్రం మహాత్మను తెరకెక్కిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ నటించిన చిత్రం ‘చందు ఛాంపియన్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement