దేశంలో దొంగలు | Team 'Desamlo Dongalu Paddaru' wrap up shoot | Sakshi
Sakshi News home page

దేశంలో దొంగలు

Published Sat, May 12 2018 5:11 AM | Last Updated on Sat, May 12 2018 5:11 AM

Team 'Desamlo Dongalu Paddaru' wrap up shoot - Sakshi

ఖయ్యూమ్, తనిష్క్‌ రాజన్‌

ఖయ్యూమ్, తనిష్క్‌ రాజన్, షానీ, పృధ్విరాజ్, సమీర్, లోహిత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. గౌతమ్‌ రాజ్‌కుమార్‌ దర్శకత్వంలో సారా క్రియేషన్స్‌పై రమాగౌతమ్, కార్తికేయ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. గౌతమ్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌ స్టోరీ. ఉమెన్‌ ట్రాఫికింగ్‌ అంశాన్ని హైలైట్‌ చేస్తూ తెరకెక్కించాం. కథలో రొమాన్స్‌కు ప్రాధాన్యత ఉంది. సినిమా యువతకు బాగా చేరువవుతుంది.

క్రైమ్‌ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌లో ఎవ్వరూ చేయని లోకేషన్లలో చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘కథకు తగ్గ మంచి నటీనటులు కుదిరారు. క్రైమ్‌ జోనర్లో కొత్త అనుభూతినిచ్చే చిత్రమిది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఈనెలలో టీజర్, జూన్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు కార్తికేయ. ఈ చిత్రానికి కెమెరా: శేఖర్‌ గంగనమోని, సంగీతం: శాండీ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కరుణాకర్, లైన్‌ ప్రొడ్యూసర్‌:  సాయికుమార్‌ పాలకూరి, సహ నిర్మాత: సంతోష్‌ డొంకాడ.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement