
తనిష్క్ రాజన్ ఖయ్యూమ్
ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీ రాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రల్లో గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. సారా క్రియేషన్స్ పతాకంపై రమా గౌతమ్ నిర్మించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని, సెన్సార్‌కి రెడీ అయింది. ఈ సందర్భంగా రమా గౌతమ్ మాట్లాడుతూ – ‘‘లొకేషన్స్ కథకు, కథనానికి బలాన్ని చేకూర్చాయి. శేఖర్ గంగనమోని కెమెరా వర్క్ హైలైట్. పూరి జగన్నాథ్ గారు రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత మంచి స్పందన రావడం ఈ మధ్య కాలంలో అరుదు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శాండీ, సహ నిర్మాత: సంతోష్ డొంకాడ.
Comments
Please login to add a commentAdd a comment