khayyum
-
ముగిసిన కమెడియన్ అలీ తమ్ముడి షూటింగ్
ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘భళా చోర భళా’. ఎ. ప్రదీప్ దర్శకత్వంలో ఈ సినిమాను ఎ. జనని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘‘సరికొత్త కథాంశంతో ‘భళా చోర భళా’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమాలో మంచి కామెడీతో పాటు థ్రిల్ చేసే మిస్టరీ అంశాలు ఉన్నాయి’’ అన్నారు ఎ. ప్రదీప్. ఈ సినిమాకు సంగీతం: సింహ కొప్పర్తి, వెంకటేష్ అద్దంకి. -
'మహమ్మద్ ఖయ్యుమ్'గా సునీల్..
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బుజ్జి ఇలా రా’. ‘సైకలాజికల్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. కెమెరామ్యాన్ ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. చాందినీ అయ్యంగార్ హీరోయిన్. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్పి, జి. నాగేశ్వర రెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని సునీల్ పాత్ర లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘‘సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. సునీల్‌గారు మహమ్మద్ ఖయ్యుమ్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్‌కి కూడా మంచి స్పందన వస్తోంది. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు, కెమెరా–దర్శకత్వం ‘గరుడవేగ’ అంజి. చదవండి : సిస్టర్‌కు ట్రీట్ ఇచ్చిన రామ్‌చరణ్ అనాథ చిన్నారులకు విశాల్ గోరుముద్దలు -
ఈ ప్రేమకథ ప్రమాదం
రెండు ప్రేమ జంటలు తమ ప్రేమ ప్రమాదంలో పడిన ప్పుడు కాపాడుకునేందుకు ఎలా ముందుకు సాగారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘డేంజర్ లవ్ స్టోరీ’. ఖయ్యూం (అలీ తమ్ముడు), మధులగ్నదాస్, గౌరవ్, అథియా హీరో హీరోయిన్లుగా శేఖర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కింది. లక్ష్మీకనక వర్షిణి క్రియేషన్స్ పతాకంపై అవధూత గోపాలరావు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 26న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రెస్మీట్లో సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘భిన్నమైన టైటిల్ ఇది. వైవిధ్యభరితమైన కథాంశంతో నేటి ప్రేక్షకులను అలరింపజేసేలా రూపొందించిన ఇలాంటి చిత్రాలు విజయవంతం కావాలి’’ అన్నారు. ‘‘ఇలాంటి చిన్న సినిమాలు బతికినపుడే పరిశ్రమ కళకళలాడుతూ ఉంటుంది’’ అన్నారు నటి కవిత. ‘‘హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం. గోవా, కొల్హాపూర్, నిజామాబాద్ తదితర లొకేషన్లలో షూటింగ్ చేశాం’’ అని అవధూత గోపాలరావు అన్నారు. ‘‘ఊహించని మలుపులతో ఆసక్తికర కథాంశంతో సాగే చిత్రమిది. ఇప్పటి వరకు ఎన్నో ప్రేమకథలు వచ్చినప్పటికీ ఇది భిన్నంగా ఉంటుంది. సస్పెన్స్, హారర్‌తో పాటు మంచి వినోదం ఉంటుంది’’ అని శేఖర్ చంద్ర చెప్పారు. గౌరవ్, అథియా, నటుడు డా.సకారం, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేందర్ పాల్గొన్నారు. -
సినిమాలో మ్యాటర్ ఉంది
‘‘దేశంలో దొంగలు పడ్డారు’ సినిమా నాకు బాగా నచ్చింది. ఖయ్యూమ్‌తో దర్శకుడు గౌతమ్ వైవిధ్యమైన సినిమా చేశాడు. టెక్నికల్‌గా ది బెస్ట్ మూవీ చేశారు. చిరంజీవిగారు మా సినిమా ట్రైలర్ విడుదల చేయటం మాకు చాలా కలిసి వచ్చింది. ఈ సినిమాలో మ్యాటర్ ఉంది. సినిమా చూడండి.. నచ్చితే ఆదరించండి’’ అని నటుడు అలీ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీ, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో అలీ సమర్పణలో రమా గౌతమ్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఖయ్యూమ్ మాట్లాడుతూ– ‘‘నేను చాలా సినిమాలు చేశా. అయితే రిలీజ్‌కు ముందు నుంచే ‘దేశంలో దొంగలు పడ్డారు’ చిత్రానికి మంచి పాజిటివ్ బజ్ వచ్చింది’’ అన్నారు. ‘‘హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో రియలిస్టిక్‌గా చేసిన చిత్రమిది. అలీగారి వల్లే ఈ సినిమా రిలీజ్ వరకు వచ్చింది’’ అన్నారు గౌతమ్ రాజ్ కుమార్. -
చిరంజీవిగారు మా సినిమాను మెచ్చుకున్నారు
‘‘దేశంలో దొంగలు పడ్డారు’ సినిమా టీజర్‌ని చిరంజీవిగారు విడుదల చేయడం వల్లే మా సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. మా సినిమాకి అలీగారు యాడ్ అయినప్పటి నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చింది’’ అని డైరెక్టర్ గౌతమ్ రాజ్‌కుమార్ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. మొహమ్మద్ అలీ సమర్పణలో రమా గౌతమ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. గౌతమ్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ బ్యాగ్రౌండ్లో పనిచేస్తున్న వ్యక్తులను తీసుకుని దొంగలు అనే కాన్సెప్ట్‌ని యాడ్ చేశాం. అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ చుట్టూ సాగే కథ కాదిది. మంచి కాన్సెప్ట్ ఉండడం వల్లే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సెలెక్ట్ అయింది. చిరంజీవిగారు కేవలం అలీగారి కోసమే మా సినిమా మొత్తం చూసి, బాగుందని మెచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. స్టార్ హీరోలున్నంత మాత్రాన సినిమా చూడరు. కొత్త హీరోలైనా సినిమా బావుంటే చూస్తున్నారు. ఈ చిత్రకథ డార్క్ జానర్ కావడంతో సహజంగా రామ్‌గోపాల్ వర్మగారే గుర్తొస్తారు. అందుకే అలీగారు నన్ను వర్మగారితో పోల్చి ఉంటారు’’ అన్నారు. -
చిరు చేతుల మీదుగా ‘దేశంలో దొంగలు పడ్డారు’ ట్రైలర్
స్టార్ కమెడియన్ ఆలీ తమ్ముడు ఖయూమ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం దేశంలో దొంగలు పడ్డారు. కమెడియన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఖయూమ్ తాజాగా హీరోగా మారి చేస్తోన్న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. “దేశంలో దొంగలు పడ్డారు' ట్రైలర్ నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషం. దీనికి కారణం నా చిరకాల మిత్రుడు అలీ సోదరుడు ఖయ్యూం ఇందులో ప్రధాన పాత్ర పోషించడం చూసి నాకు ఓ గుడ్ ఇంప్రెషన్ వచ్చింది. డైరెక్టర్ గౌతమ్ ఫస్ట్‌టైమ్ డైరెక్ట్ చేస్తున్నప్పటికీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఓ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నట్లుగా అనిపించింది. ట్రైలర్ ఇంప్రెస్సీవ్ గా ఉంది. ముందుగా అలీ నాదగ్గరికి వచ్చి ఖయ్యూం నటించిన సినిమా అనగానే ఇదొక కామెడీ సినిమా అనుకున్నాను, గానీ ఇది ఒక సీరియస్ సినిమా అని ట్రైలర్ చూసాక అర్థం అయ్యింది. ఇది ఖయ్యూంకు ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. తన కెరియర్‌కు ఇది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. అలాగే కొత్త అమ్మాయి తనిష్క కూడా పెరఫార్మర్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించిందని అర్థం అవుతుంది.. ఈ సందర్భంగా యూనిట్‌కు సంబంధించిన టెక్నీషియన్ సభ్యులందరికీ, అలాగే మా ఖయ్యూం కి ఆల్ ది వెరీ బెస్ట్, గౌతమ్‌ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను’ అని అన్నారు. -
నేను పెద్ద స్టార్ అవుతానన్నారు
‘‘టి. కృష్ణగారి ‘దేశంలో దొంగలుపడ్డారు’ సినిమాలో వేషం కోసం వెళ్లా. ‘నీ ఫేస్ కామెడీగా ఉంటుంది.. పైగా చిన్నపిల్లాడివి.. నువ్వు చచ్చిపోయే పాత్ర చేస్తే జనాలు నవ్వుతారు.. వద్దు.. అన్నారు. ‘ఏ రోజుకైనా ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు’ అని ఆయన తన స్నేహితులతో ఆ రోజే చెప్పారట’’ అని నటుడు అలీ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్, రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో రమా గౌతమ్ నిర్మించిన ఈ సినిమాకి అలీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘టి.కృష్ణగారి స్నేహితుడు నాగేశ్వరరావుగారు ముత్యాల సుబ్బయ్యగారి దర్శకత్వంలో తీసిన ‘అమ్మాయి కాపురం’ సినిమాకు నాకు ఉత్తమ కథానాయకుడిగా అవార్డు వచ్చింది. ‘దేశంలో దొంగలుపడ్డారు’ కోసం కొన్నాళ్లు భోజనం కూడా సరిగా లేకుండా పని చేశానని నా తమ్ముడు ఖయ్యూమ్ చెప్పాడు. వాడి కోసమే ఈ సినిమా చూశా. గౌతమ్ రాజ్‌కుమార్ కొత్త దర్శకుడైనా తనని చూస్తే 30 ఏళ్లకు ముందు రామ్‌గోపాల్ వర్మను చూసినట్టు అనిపించింది’’ అన్నారు. ‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ, సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ తెరకెక్కించాం. విడుదలకు ముందే మా సినిమా బ్లాక్ బెర్రీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కి వెళ్లడం సంతోషంగా ఉంది’’ అన్నారు గౌతమ్ రాజ్‌కుమార్. ఖయ్యూమ్, సహ నిర్మాత సంతోష్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయికుమార్ పాలకుర్తి, సహ నిర్మాతలు: సంతోష్ డొంకాడ, సెలెట్ కనెక్ట్స్. -
చిన్న సినిమాలను ప్రోత్సహించాలి
‘‘సినిమా తీసే వరకే పెద్దది, చిన్నది అని నిర్మాత అనుకుంటాడు. హిట్ అయ్యాక ఏదైనా ఒకటే. చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఈ వేడుకకు వచ్చా’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ఖయ్యూం, గౌరవ్ హీరోలుగా, మధులగ్నదాస్, అధియ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘డేంజర్ లవ్ స్టోరీ’. శేఖర్ చంద్ర దర్శకత్వంలో అవధూత లక్ష్మీ సమర్పణలో లక్ష్మీ కనకవర్షిణి క్రియేషన్స్‌పై అవధూత గోపాల్‌రావు నిర్మించారు. భానుప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సి.కల్యాణ్ విడుదల చేసి, ప్రతాని రామకృష్ణ గౌడ్, సాయివెంకట్లకు అందించారు. ‘‘20 ఏళ్లుగా పలు సినిమాల్లో నటించిన అనుభవంతో ఈ సినిమా నిర్మించా. మా అబ్బాయి గౌరవ్ ఈ చిత్రంలో ఓ హీరోగా నటించాడు. ఆగస్టులో సినిమా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు గోపాల్‌రావు. -
దొంగలు వస్తున్నారు
ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీ రాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రల్లో గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. సారా క్రియేషన్స్ పతాకంపై రమా గౌతమ్ నిర్మించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని, సెన్సార్‌కి రెడీ అయింది. ఈ సందర్భంగా రమా గౌతమ్ మాట్లాడుతూ – ‘‘లొకేషన్స్ కథకు, కథనానికి బలాన్ని చేకూర్చాయి. శేఖర్ గంగనమోని కెమెరా వర్క్ హైలైట్. పూరి జగన్నాథ్ గారు రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత మంచి స్పందన రావడం ఈ మధ్య కాలంలో అరుదు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శాండీ, సహ నిర్మాత: సంతోష్ డొంకాడ. -
దేశంలో దొంగలు
ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృధ్విరాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో సారా క్రియేషన్స్‌పై రమాగౌతమ్, కార్తికేయ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. గౌతమ్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. ఉమెన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ తెరకెక్కించాం. కథలో రొమాన్స్‌కు ప్రాధాన్యత ఉంది. సినిమా యువతకు బాగా చేరువవుతుంది. క్రైమ్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌లో ఎవ్వరూ చేయని లోకేషన్లలో చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘కథకు తగ్గ మంచి నటీనటులు కుదిరారు. క్రైమ్ జోనర్లో కొత్త అనుభూతినిచ్చే చిత్రమిది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఈనెలలో టీజర్, జూన్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు కార్తికేయ. ఈ చిత్రానికి కెమెరా: శేఖర్ గంగనమోని, సంగీతం: శాండీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కరుణాకర్, లైన్ ప్రొడ్యూసర్: సాయికుమార్ పాలకూరి, సహ నిర్మాత: సంతోష్ డొంకాడ. -
ఎవరు ఆడారు?
హాస్యనటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఖయ్యుమ్ (అలీ తమ్ముడు) ఫస్ట్ టైమ్ హీరోగా నటించిన చిత్రం ‘డర్టీ గేమ్’. అస్మిత కథానాయిక. షిరిడీసాయి క్రియేషన్స్ పతాకంపై తాడి మనోహర్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సునీల్ కశ్యప్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని దర్శకుడు సాగర్, నిర్మాత ప్రసన్న కుమార్ విడుదల చేశారు. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘మంచి కథ కుదిరింది. డర్టీ గేమ్ ఏంటి? ఎవరెవరు ఆడారు? అన్నది ఆసక్తికరం. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ అంశాలన్నీ మా చిత్రంలో ఉంటాయి. సునీల్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘పూరీ జగన్నాథ్ వంటి దర్శకులతో పని చేసిన నేను ఈ చిత్రం చేయడానికి కారణం కథ నచ్చడమే. పాటలు ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకం ఉంది’’ అని సునీల్ కశ్యప్ అన్నారు. ఖయ్యుమ్, అస్మిత, కవిత, జీవీ, కోటా శంకర్ రావు, సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బీఎస్ కుమార్. -
జీహెచ్ఎంసీ అధికారులపై దాడి, కేసు నమోదు
బంజారాహిల్స్: ఆస్తిపన్ను వసూలు చేయడానికి వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులపై దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే....జీహెచ్ఎంసీ సర్కిల్-10(బి) అధికారులు శనివారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నంబర్-14లోని మంజిల్ క్యాజిల్ అపార్ట్‌మెంట్స్‌లో ఆస్తిపన్ను వసూలు చేయడానికి వెళ్లారు. అయితే అపార్ట్మెంట్లో నివసించే ఖయ్యుం, హకీం అనే ఇద్దరు వారిని అసభ్య పదజాలంతో దూషించటంతోపాటు నెట్టేసేందుకు ప్రయత్నించారు. దీనిపై అధికారి సురేష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు అపార్ట్మెంట్లో రూ.73,815 ఆస్తి పన్ను బకాయి ఉందని ఇప్పటికే చాలాసార్లు నోటీసులు జారీ చేయడం జరిగిందని సురేష్ చెప్పారు. తాజాగా నోటీసులకు సమాధానం చెప్పకపోవడంతో వసూళ్ల కోసం వెళ్లిన తమను అడ్డుకొని దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. బంజారాహిల్స్ పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 353, 506, 323 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న అల్లరి నరేష్
తిరుమల : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరసామి వారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించకున్నారు. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్‌తోపాటు ప్రముఖ హస్య నటుడు అలీ సోదరుడు ఖయ్యూం తిరుమల శ్రీవారిని ఈ రోజు తెల్లవారుజామున దర్శించుకున్నారు. అలాగే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు కె. హరిబాబు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి దేవస్థానం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అల్లరి నరేష్ అలీ సోదరుడు ఖయ్యూం ప్రాణ స్నేహితులన్న విషయం తెలిసిందే. -
ఖయ్యూమ్ ఏదైనా ఇట్టే పసిగట్టేస్తాడు..
ఎప్పుడో.. అనుకోకుండా కలిసిన ఓ స్పర్శ.. అనంతరం ఆత్మీయ మనసై మనవెంట వస్తుంది. బాధలో ఓదారుస్తుంది. పడిపోతుంటే చేయందిస్తుంది. మనసెరిగి మసలుకుంటుంది. అదే స్నేహం. జీవిత ఎత్తుపల్లాలను తనవిగా భావించి మనసున మనసై చిరకాలం నిలిచిన స్నేహితుడు అల్లరి నరేష్ తమ స్నేహాన్ని ఇలా ఆవిష్కరించారు. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో చెన్నైలో నాన్న దగ్గరకు వెళ్లా. అప్పుడు ఆయన ‘ఏవండీ ఆవిడొచ్చింది’ సినిమా తీస్తున్నారు. షూటింగ్లో పరిచయమయ్యాడు హాస్య నటుడు అలీ సోదరుడు ఖయ్యూమ్. ఆ సినిమాల్లో మేము కలిసి నటించాం కూడా. అలా ఆర్టిస్టులుగా ఏర్పడ్డ మా పరిచయం ఆత్మీయ స్నేహమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఉన్న ఆప్త మిత్రుడు ఖయ్యూమ్. మేము హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన రోజుల్లోనే అలీ కుటుంబం కూడా ఇక్కడకు వచ్చేసింది. అప్పటి నుంచి రెగ్యులర్‌గా కలుసుకుంటూనే ఉన్నాం. ఖయ్యూమ్ నిష్కల్మశమైన వ్యక్తి. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. నా ప్రతి ఫీలింగ్‌ను ఇట్టే పసిగట్టేస్తాడు. నా మనసులోని భావనలు బయటకు కనిపించకుండా ప్రయత్నిస్తాను. కానీ కయ్యూమ్కు మాత్రం తెలిసిపోతాయి. ప్రతి రోజూ కాకపోయినా అవకాశం ఉన్న ప్రతిసారి కలుస్తాం. మా మధ్య సినిమాల కంటే లెటెస్ట్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు వంటివే ఎక్కువ చర్చనీయాంశాలవుతాయి. ఇద్దరం కలిసి కాఫీషాప్లకు వెళ్తాం. కలిసి సినిమాలు చూస్తాం. చాలా హ్యాపీగా గడిపేస్తాం. - అల్లరి నరేష్, సినీనటుడు -
అలీ సోదరుడు ఖయ్యూం వివాహం
-
వైభవంగా సినీనటుడు ఖయ్యూం నిఖా
గుంటూరు : ప్రముఖ హాస్యనటుడు అలీ సోదరుడు, సినీనటుడు మహ్మద్ ఖయ్యూం వివాహం (నిఖా) ఆదివారం గుంటూరులోని సన్నిధి కల్యాణ మండపంలో వైభవంగా జరిగింది. గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ నయాబ్ కమాల్ పెద్దకుమార్తె ఆర్షియా కమాల్‌తో ఖయ్యూంకు వివాహమైంది. ఈ వేడుకకు ప్రముఖ సినీనటులు, డైరెక్టర్లు, రాజకీయ నాయకులు, గుంటూరు నగరానికి చెందిన ప్రముఖులు హాజరై ఖయ్యుంకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. సినీనటులు శ్రీకాంత్, అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, తరుణ్, రాజీవ్ కనకాల, వెంకట్, దర్శకులు కృష్ణవంశీ, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, నటుడు, ఎంపీ మురళీ మోహన్, ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రొమాంటిక్ థ్రిల్లర్
ఖయ్యుమ్, సంచితా పదుకొనే జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. కేదారేశ్వరరెడ్డి దర్శకుడు. షేక్ అలీబాషా నిర్మాత. ఈ చిత్ర షూటింగ్ శనివారం హైదరాబాద్‌లో మొదలైంది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిదనీ, సింగిల్ షెడ్యూల్లో వైజాగ్, హైదరాబాద్‌ల్లో చిత్రీకరణ జరుపుతామనీ దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజేశ్ వర్మ. -
రోడ్డు ప్రమాదం: అలీ సోదరుడికి తీవ్ర గాయాలు
-
రోడ్డు ప్రమాదం: అలీ సోదరుడికి గాయాలు
హయత్‌నగర్ మండలం కోహెడ్ వద్ద బుధవారం ఉదయం స్కార్పియో వాహనాన్ని టిప్పర్ ఢీ కొట్టింది. ఆ ఘటనలో ప్రముఖ హాస్య నటుడు అలీ సోదరుడు ఖయ్యుమ్కు గాయాలయ్యాయి. దీంతో అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించారు. స్కార్పియోలో చిక్కుకున్న ఖయ్యుమ్ను బయటకు తీసి మలక్ పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. స్కార్పియో వాహనంలో ఖయ్యుమ్ మరో వ్యక్తి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తి చేసుకుని వస్తుండగా ఆ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయని అతడిని కూడా అదే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రెండు ఇసుక లారీలు ఢీ
చెన్నూర్ రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని బావురావుపేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున ముందు వెళ్తున్న ఇసుక లారీని మరో ఇసుక లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో వెనక లారీలో ఉన్న డ్రైవర్‌కు తీవ్ర గాయూలయ్యూరుు. పోలీసుల కథనం ప్రకారం.. అక్కెపల్లి ఇసుక క్వారీ నుంచి ఇసుక లోడ్లతో లారీలు బయల్దేరారుు. బావురావుపేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గుంతలు ఉండటంతో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ బ్రేక్ వేసి వాహన వేగాన్ని తగ్గించాడు. వెనకాలే వస్తున్న మరో ఇసుక లారీ డ్రైవర్ గమనించలేదు. వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టాడు. వెనక లారీలో ఉన్న క్లీనర్ దూకడంతో అతడికి గాయూలేమికాలేదు. డ్రైవర్ కొప్పుల రవీందర్‌రెడ్డి వాహనంలో ఇరుక్కుపోయూడు. గమనించి ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపేసి వాహనంలో ఇరుక్కుపోరుున రవీందర్‌రెడ్డిని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. అతడిని 108లో చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం అతడి స్వగ్రామమైన వరంగల్ ఆస్పత్రికి తరలించారు. ఢీకొట్టిన లారీ ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. వేగంగా వచ్చి లారీని వెనక నుంచి ఢీకొట్టి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ రవీందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఖయ్యూం తెలిపారు.