వైభవంగా సినీనటుడు ఖయ్యూం నిఖా | ali brother khayyum marriage | Sakshi
Sakshi News home page

వైభవంగా సినీనటుడు ఖయ్యూం నిఖా

Feb 23 2015 11:08 AM | Updated on Sep 2 2017 9:47 PM

వైభవంగా సినీనటుడు ఖయ్యూం నిఖా

వైభవంగా సినీనటుడు ఖయ్యూం నిఖా

ప్రముఖ హాస్యనటుడు అలీ సోదరుడు, సినీనటుడు మహ్మద్ ఖయ్యూం వివాహం (నిఖా) ఆదివారం గుంటూరులోని సన్నిధి కల్యాణ మండపంలో వైభవంగా జరిగింది.

గుంటూరు : ప్రముఖ హాస్యనటుడు అలీ సోదరుడు, సినీనటుడు మహ్మద్ ఖయ్యూం వివాహం (నిఖా) ఆదివారం గుంటూరులోని సన్నిధి కల్యాణ మండపంలో వైభవంగా జరిగింది. గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ నయాబ్ కమాల్ పెద్దకుమార్తె ఆర్షియా కమాల్తో ఖయ్యూంకు వివాహమైంది. ఈ వేడుకకు ప్రముఖ సినీనటులు, డైరెక్టర్లు, రాజకీయ నాయకులు, గుంటూరు నగరానికి చెందిన ప్రముఖులు హాజరై ఖయ్యుంకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

సినీనటులు శ్రీకాంత్, అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, తరుణ్, రాజీవ్ కనకాల, వెంకట్, దర్శకులు కృష్ణవంశీ, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, నటుడు, ఎంపీ మురళీ మోహన్, ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement