
శ్రీవారిని దర్శించుకున్న అల్లరి నరేష్
తిరుమల : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరసామి వారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించకున్నారు. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్తోపాటు ప్రముఖ హస్య నటుడు అలీ సోదరుడు ఖయ్యూం తిరుమల శ్రీవారిని ఈ రోజు తెల్లవారుజామున దర్శించుకున్నారు. అలాగే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, విశాఖపట్నం లోక్సభ సభ్యుడు కె. హరిబాబు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం వారికి దేవస్థానం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అల్లరి నరేష్ అలీ సోదరుడు ఖయ్యూం ప్రాణ స్నేహితులన్న విషయం తెలిసిందే.