
ఎం.లోహిత్, ఎం. తీర్ధు సోమదేవ్
పుణే: జాతీయ సబ్‌జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ ఎం.లోహిత్ మూడో స్వర్ణాన్ని సాధించాడు. గురువారం జరిగిన గ్రూప్–1 బాలుర 50మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో లోహిత్ విజేతగా నిలిచాడు. అంతకుముందు 100మీ., 200మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లలోనూ లోహిత్ పసిడి పతకాలను గెలుచుకున్నాడు. మరోవైపు గ్రూప్–4 బాలుర 50మీ. బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో ఏపీకే చెందిన ఎం. తీర్ధు సోమదేవ్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. బుధవారం జరిగిన 50మీ. బటర్‌ఫ్లయ్ విభాగంలోనూ సోమదేవ్ విజేతగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment