
మంగళూరు: జాతీయ సీనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ రెండో పతకాన్ని సాధించింది. పోటీల రెండో రోజు బుధవారం హైదరాబాద్‌కు చెందిన వృత్తి అగర్వాల్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో విజేతగా నిలిచింది.
వృత్తి 1500 మీటర్లను అందరికంటే వేగంగా 17 నిమిషాల 45.63 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో వృత్తి రజత పతకం గెల్చుకుంది.