
Senior Actress Shobana Testes Positive For Omicron: దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా సీనియర్ హీరోయిన్ శోభన కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ప్రపంచమంతా అద్భుతంగా నిద్రపోతున్న వేళ.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి నేను ఒమిక్రాన్ బారిన పడ్డాను. కీళ్లనొప్పులు, చలి, గొంతు నొప్పి వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డాను. ఇప్పటికే రెండు టీకాలు తీసుకున్నాను. దీని వల్ల ఒమిక్రాన్ ముప్పు నుంచి 85శాతం కోలుకుంటామని నమ్ముతున్నాను.
అందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని కోరుకుంటున్నాను అని పేర్కొంది. కాగా దేశంలో కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే మహేశ్‌బాబు, మంచు లక్ష్మీ, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, త్రిష సహా పలువురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment