Actress Shobana To Play Key Role In Mahesh Babu Trivikram Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

SSMB 28 Update: మహేశ్‌కు పిన్నిగా అలనాటి హీరోయిన్‌ శోభన

Published Mon, Feb 21 2022 12:49 PM | Last Updated on Mon, Feb 21 2022 1:11 PM

Shobana To Play Key Role In Mahesh-Trivikram Film - Sakshi

Shobana To Play Key Role In Mahesh-Trivikram Film: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనంతరం ఆయన డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలె పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. SSMB28గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘అతడు, ఖలేజా’తర్వాత మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం కావడంతో భారీ హైప్‌ నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ గాసిప్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో మహేశ్‌ పిన్నిగా అలనాటి హీరోయిన్‌ శోభన నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement