శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్
గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు ప్రారంభం
పాల్గొన్న మంత్రులు, ఇతర ప్రముఖులు
లంగర్‌హౌస్ (హైదరాబాద్): గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, అయితే సీఎం రేవంత్‌రెడ్డి అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణను అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో మెదటి బోనాల పూజలు అందుకునే గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆదివారం లంగర్‌హౌస్‌లో ప్రారంభించారు.
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారమ్యన్, గోల్కొండ జగదాంబిక ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కాంత అరవింద్‌ల ఆధ్వర్యంలో మంత్రులు లంగర్‌హౌస్ చౌరస్తాలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం నజర్‌బోనంతో, తొట్టెలను ఊరేగింపుగా గోల్కొండ కోటకు తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఈ సంవత్సరం రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున గోల్కొండకు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
20 కోట్లు మంజూరు..
అనంతరం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లా డుతూ.. బోనాల ఉత్సవాల నిర్వహణకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు గత సంవత్సరం కంటే రూ.5 కోట్లు ఎక్కు వగా అంటే ఈ సంవత్సరం రూ.20 కోట్లు మంజూరు చేశా మని తెలిపారు. ఒక వేళ ఈ నిధులు సరిపోకపోతే మరింత అందజేస్తామని వివరించారు. గోల్కొండ బోనాలు నిర్వ హించే కార్వాన్ నియోజకవర్గానికి 73 లక్షల 15 వేల రూపా యలు మంజూరు చేశామన్నారు.
అనంతరం ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జంట నగరాల బోనా ల ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరఫున రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. దానం నాగేందర్, చిన్నారెడ్డి, మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంత రావు, సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment