స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు కేటీఆర్‌ లేఖ.. విషయమేంటంటే? | BRS KTR Wrote A Letter To Assembly Speaker Gaddam Prasad Over Congress Govt, See Details Inside | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు కేటీఆర్‌ లేఖ.. విషయమేంటంటే?

Published Mon, Jul 15 2024 4:07 PM | Last Updated on Mon, Jul 15 2024 5:44 PM

BRS KTR Wrote A Letter To Assembly Speaker Gaddam Prasad

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వేళ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రేవంత్‌ సర్కార్‌ శాసనసభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా కాలరాస్తోందని ఆరోపించారు.

కాగా, కేటీఆర్‌ లేఖలో కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ లేఖ ప్రకారం.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అహంకారపూరితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాంగ్రెస్‌ ప్రభుత్వం దెబ్బతిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నేతలకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు.

శాసససభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా రేవంత్ సర్కార్ కాలరాస్తోంది. ఎమ్మెల్యేల హక్కులు, ప్రోటాకాల్ ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవాలి. ఈ మేరకు సీఎస్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక, అవసరమైతే ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కూడా లేవనెత్తుతామని తెలిపారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ప్రోటోకాల్‌ ఉల్లంఘనపై మాజీ మంత్రి హరీష్‌ రావు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చురకలు అంటించారు. తాజాగా హరీష్‌ రావు..‘మూడు సార్లు మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా? ప్రజలు గెలిపించిన నాయకులకు విలువ లేదా?. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని విస్మరించి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి, మూడో స్థానానికి పరిమితమైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి అధికార యంత్రాంగం సలాం కొట్టడం ఏమిటి?.

ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. కనీస చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రోటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు జరుగుతున్న అవమానం పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్‌ వెంటనే స్పందించాలి. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement