లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం(టీఈఎన్‌ఎఫ్) ఆధ్వర్యంలో ఈస్ట్‌హాం నగరంలో బోనాల ఉత్సవాలు జరిగాయి. ఈ మేరకు టీఈఎన్‌ఎఫ్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. సంప్రదాయబద్దంగా అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించినట్లు తెలిపింది. డ్యాన్సులు, డప్పులతో ఈస్ట్ హాం నగరంలో పండుగ వాతావరణం ఏర్పడింది పేర్కొంది. వెదురు బద్దలు, రంగు కాగితాలతో తయారు చేసిన తొట్టెల ఊరేగింపు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు తెలిపింది.
తెలంగాణ కుటుంబాల కోరిక మేరకు ఈస్ట్ లండన్, వెస్ట్ లండన్‌లలో వేర్వేరుగా బోనాలు నిర్వహించింది టీఈఎన్‌ఎఫ్. ఈ ఉత్సవాలకు భారతీయ హై కమిషనర్ ఎ.ఎస్ రాజన్, స్ధానిక కౌన్సిలర్ పాల్ సతినేసాంలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యూకే నలుమూలల నుంచి 600 మంది తెలంగాణవాసులు వేడుకలకు విచ్చేశారు. టీఈఎన్‌ఎఫ్ ఈ ఏడాది చేపట్టిన 'చేనేతకు చేయూతనిద్దాం.. నేతన్నకు మద్దతునిద్దాం', 'చేనేత వస్త్రాలయం' కార్యక్రమాలను ముఖ్య అతిథులకు పరిచయం చేశారు.
ప్రవాసులకు, స్థానికులకు చేనేత వస్త్రాలను పరిచయం చేసిన విధానాలను ముఖ్యఅతిథులు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ వేడుకలలో భాగంగా తెలంగాణా నేతన్నల వద్ద నుంచి చేనేత వస్త్రాలను తెప్పించి 'చేనేత వస్త్రాలయం' ద్వారా స్థానిక ఎన్నారైల కోసం అందుబాటులో ఉంచింది టీఈఎన్‌ఎఫ్. బోనం ఎత్తిన ఆడపడచులందరికి విలువైన కానుకలు మరియు వేడుకలకు హాజరైన వారికి రాఫెల్ డ్రా నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
టీఈఎన్‌ఎఫ్ సంస్ధ విద్య, సంగీతం, కళలు, సాంస్కృతిక, క్రీడలు, వ్యాపారం, స్వచ్ఛంద సేవ, సమాజ సేవ వంటి పలు రంగాలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు, యువతీ యువకులకు 'ఆచార్య శ్రీ జయశంకర్ పురస్కారాలు' అందజేశారు. అలాగే బోనాలు వేడుకలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపికలతో సత్కరించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడానికి పలువురు ఎనలేని కృషి చేశారు. తెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా విభాగం సభ్యులు- హేమలత గంగసాని, వనమాల గోపతి, నందిని మొట్ట, మంజుల పిట్టల, భారతి కొప్పుల, శ్రీలక్ష్మి మర్యాల, శ్రీవాణి మార్గం, సుచరిత కాల్వ, వర్ష కటికనేని, రజిత నీల, జ్యోతి రెడ్డి కాసర్ల, కవిత గోలి, కావ్య రెడ్డి, మేఘల ఆకుల, ప్రీతీ సీక, శశి కుడికాయల, ఉమగిరివాని, రమాదేవి తిరునగరి, శౌరి రంగుల, వాణి రంగు తదితరులు కార్యక్రమానికి సంబంధించిన పూజ నిర్వహణ, ఒడి బియ్యం, ఊరేగింపులలో పాల్గొన్న ఆడపడుచులకు తోడ్పాటుని అందించారు.
తెలంగాణా ఎన్నారై ఫోరం ఎగ్జిక్యూటివ్ టీం- వ్యవస్థాపక సభ్యులు గంప వేణుగోపాల్, అడ్వైజరీ బోర్డు చైర్మన్ అంతటి ప్రమోద్, అధ్యక్షులు సీకా చంద్ర శేఖర్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ గంగసాని, తిరుపతి గోలి, ముఖ్యకార్యదర్శులు నగేష్ కాసర్ల, సుధాకర్ రంగుల, ఉమ్మడి కార్యదర్శులు భాస్కర్ పిట్ల, సురేష్ గోపతి, కోశాధికారులు వెంకట్ రంగు, నరేష్ మరియాల, స్కాట్లాండ్ కన్వీనర్ శ్రీధర్‌రావు కలకుంట్ల, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి స్వామి ఆశ, క్రీడా కార్యదర్శుల స్పాన్సర్ టీం అశోక్ మేడిశెట్టి, భాస్కర్ మొట్ట, రాజేష్ ఎనపోతుల, మీడియా టీం- సాయి ప్రసాద్ మార్గం, శిరీష కే చౌదరి, స్వచ్చంద, సంక్షేమ టీం- మీనాక్షి అంతటి, సంతోష్ ఆకుల, ఏరియా ఇంచార్జిలు సంతోష్ ఏరుకుల్ల, ఈస్ట్, నార్త్ ఈవెంట్ కో-ఆర్డినేటర్స్- చంద్రకాంత్, దేవులపల్లి శ్రీనివాసరావు, శశి కొప్పుల, శ్రీధర్ బాబు మంగళారపు, శ్రీధర్ నల్ల తదితరులు బోనాలు వేడుకలలో చైతన్యవంతంగా పాల్గొన్నారు.
లండన్‌లో ఘనంగా బోనాలు ఉత్సవాలు
Published Mon, Jul 3 2017 7:45 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
Advertisement
Advertisement