TeNF
-
లండన్‌లో ఘనంగా బోనాలు
లండన్ : తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం (టీఈఎన్ఎఫ్) ఆధ్వర్యంలో లండన్‌లోని కాన్‌ఫోర్డ్ కళాశాలలో ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుంచి ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. ఈ వేడుకలకు లండన్ ఎంపీలు వీరేంద్రశర్మ, సీమా మల్హోత్రా, భారత రాయభార కార్యాలయ ఉన్నతాధికారి కే ఈవోమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతీయ సంస్కృతి ప్రచారంలో తెలుగువారు మొదటిస్థానంలో ఉన్నారని ఎంపీ వీరేంద్రశర్మ తెలిపారు. ఎనిమిదేళ్లుగా లండన్ బోనాల వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఉందని చెప్పారు. ఇంగ్లాండ్ గడ్డపై తన నియోజకవర్గంలో బోనాలు నిర్వహించడం, హిందూ సంప్రదాయాల్లో తాను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఎంపీ సీమా మల్హోత్రా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో 2011లో తొలిసారిగా బోనాలు నిర్వహించిన తనకు సహకరించి.. ఇప్పుడు విశ్వవ్యాప్తంగా బోనాల నిర్వహణకు దోహదపడుతున్న వారందరికీ తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం వ్యవస్థాపకుడు, చైర్మన్ గంప వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆచార, సంప్రదాయాలను ప్రచారంచేయడాన్ని సేవగా సంస్థ స్వీకరిస్తోందని, నియమ నిబంధనల మేరకు కలిసివచ్చే అందరితో సంస్థ పనిచేస్తుందని టీఈఎన్ఎఫ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌గౌడ్ తెలిపారు. విదేశాల్లో పుట్టిపెరిగే భారతీయ సంతతి కోసం మన పండుగలు నిర్వహించడం చాలాముఖ్యమని ఉపాధ్యక్షులు ప్రవీణ్‌రెడ్డి, రంగు వెంకట్ అన్నారు. స్థానిక లక్ష్మీనారాయణ గుడిలో కార్యదర్శి, మహిళాసభ్యుల ఆధ్వర్యంలో దుర్గామాతకు బోనం, ఒడిబియ్యం సమర్పించారు. లండన్ పురవీధుల్లో తొట్టెలు, బోనాల శోభాయాత్రను కన్నులపండువగా నిర్వహించారు. కాన్‌ఫోర్డ్ కళాశాల ఆడిటోరియంలో మీనాక్షి అంతరి అధ్యక్షతన వీరేంద్రవర్మ, శ్రీవాణి.. మహంకాళి మాతకు బోనాలు సమర్పించి పూజలు జరిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారతనాట్యం, గీతాలాపన, చిన్నారుల నృత్య ప్రదర్శన, ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో మహేష్ జమ్ముల, స్వామి ఆశ, వెంకట్ ఆకుల, మహేష్ చట్ల, బాల కృష్ణ రెడ్డి, శేషు అల్ల, నరేంద్ర వర్మ, సాయి మార్గ్, మీనాక్షి అంతటి, వాణి అనసూరి, శ్రీవాణీ, సవిత, సీత, శౌరి, దివ్య, సాయి లక్ష్మి, శిరీష, అశోక్ మేడిశెట్టి, నర్సింహా రెడ్డి తిరుపరి, రాజు కొయ్యడ, రవి కూర, నరేందర్, మల్లేష్ తదితరులు ఎంతగానో కృషి చేశారు. -
లండన్‌లో ఘనంగా బోనాలు ఉత్సవాలు
లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం(టీఈఎన్ఎఫ్) ఆధ్వర్యంలో ఈస్ట్‌హాం నగరంలో బోనాల ఉత్సవాలు జరిగాయి. ఈ మేరకు టీఈఎన్ఎఫ్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. సంప్రదాయబద్దంగా అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించినట్లు తెలిపింది. డ్యాన్సులు, డప్పులతో ఈస్ట్ హాం నగరంలో పండుగ వాతావరణం ఏర్పడింది పేర్కొంది. వెదురు బద్దలు, రంగు కాగితాలతో తయారు చేసిన తొట్టెల ఊరేగింపు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు తెలిపింది. తెలంగాణ కుటుంబాల కోరిక మేరకు ఈస్ట్ లండన్, వెస్ట్ లండన్లలో వేర్వేరుగా బోనాలు నిర్వహించింది టీఈఎన్ఎఫ్. ఈ ఉత్సవాలకు భారతీయ హై కమిషనర్ ఎ.ఎస్ రాజన్, స్ధానిక కౌన్సిలర్ పాల్ సతినేసాంలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యూకే నలుమూలల నుంచి 600 మంది తెలంగాణవాసులు వేడుకలకు విచ్చేశారు. టీఈఎన్ఎఫ్ ఈ ఏడాది చేపట్టిన 'చేనేతకు చేయూతనిద్దాం.. నేతన్నకు మద్దతునిద్దాం', 'చేనేత వస్త్రాలయం' కార్యక్రమాలను ముఖ్య అతిథులకు పరిచయం చేశారు. ప్రవాసులకు, స్థానికులకు చేనేత వస్త్రాలను పరిచయం చేసిన విధానాలను ముఖ్యఅతిథులు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ వేడుకలలో భాగంగా తెలంగాణా నేతన్నల వద్ద నుంచి చేనేత వస్త్రాలను తెప్పించి 'చేనేత వస్త్రాలయం' ద్వారా స్థానిక ఎన్నారైల కోసం అందుబాటులో ఉంచింది టీఈఎన్ఎఫ్. బోనం ఎత్తిన ఆడపడచులందరికి విలువైన కానుకలు మరియు వేడుకలకు హాజరైన వారికి రాఫెల్ డ్రా నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. టీఈఎన్ఎఫ్ సంస్ధ విద్య, సంగీతం, కళలు, సాంస్కృతిక, క్రీడలు, వ్యాపారం, స్వచ్ఛంద సేవ, సమాజ సేవ వంటి పలు రంగాలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు, యువతీ యువకులకు 'ఆచార్య శ్రీ జయశంకర్ పురస్కారాలు' అందజేశారు. అలాగే బోనాలు వేడుకలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడానికి పలువురు ఎనలేని కృషి చేశారు. తెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా విభాగం సభ్యులు- హేమలత గంగసాని, వనమాల గోపతి, నందిని మొట్ట, మంజుల పిట్టల, భారతి కొప్పుల, శ్రీలక్ష్మి మర్యాల, శ్రీవాణి మార్గం, సుచరిత కాల్వ, వర్ష కటికనేని, రజిత నీల, జ్యోతి రెడ్డి కాసర్ల, కవిత గోలి, కావ్య రెడ్డి, మేఘల ఆకుల, ప్రీతీ సీక, శశి కుడికాయల, ఉమగిరివాని, రమాదేవి తిరునగరి, శౌరి రంగుల, వాణి రంగు తదితరులు కార్యక్రమానికి సంబంధించిన పూజ నిర్వహణ, ఒడి బియ్యం, ఊరేగింపులలో పాల్గొన్న ఆడపడుచులకు తోడ్పాటుని అందించారు. తెలంగాణా ఎన్నారై ఫోరం ఎగ్జిక్యూటివ్ టీం- వ్యవస్థాపక సభ్యులు గంప వేణుగోపాల్, అడ్వైజరీ బోర్డు చైర్మన్ అంతటి ప్రమోద్, అధ్యక్షులు సీకా చంద్ర శేఖర్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ గంగసాని, తిరుపతి గోలి, ముఖ్యకార్యదర్శులు నగేష్ కాసర్ల, సుధాకర్ రంగుల, ఉమ్మడి కార్యదర్శులు భాస్కర్ పిట్ల, సురేష్ గోపతి, కోశాధికారులు వెంకట్ రంగు, నరేష్ మరియాల, స్కాట్లాండ్ కన్వీనర్ శ్రీధర్‌రావు కలకుంట్ల, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి స్వామి ఆశ, క్రీడా కార్యదర్శుల స్పాన్సర్ టీం అశోక్ మేడిశెట్టి, భాస్కర్ మొట్ట, రాజేష్ ఎనపోతుల, మీడియా టీం- సాయి ప్రసాద్ మార్గం, శిరీష కే చౌదరి, స్వచ్చంద, సంక్షేమ టీం- మీనాక్షి అంతటి, సంతోష్ ఆకుల, ఏరియా ఇంచార్జిలు సంతోష్ ఏరుకుల్ల, ఈస్ట్, నార్త్ ఈవెంట్ కో-ఆర్డినేటర్స్- చంద్రకాంత్, దేవులపల్లి శ్రీనివాసరావు, శశి కొప్పుల, శ్రీధర్ బాబు మంగళారపు, శ్రీధర్ నల్ల తదితరులు బోనాలు వేడుకలలో చైతన్యవంతంగా పాల్గొన్నారు. -
తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ నూతన కార్యవర్గం ఏర్పాటు
లండన్ : తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ (TeNF ) నూతన కార్యవర్గం ఏర్పాటైంది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలోకి అడుగు పెడుతూ తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 2012 లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ పని చేసి సంస్కృతి, సేవ , భాషాభివృద్ధి లక్ష్యంగా తమవంతు బాధ్యతగా తెలంగాణలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 2017లో 'చేనేతకు చేయూత' కార్యక్రమం ద్వారా చేనేత వస్త్రాలను విదేశాల్లో మొట్ట మొదటిసారిగా భారీస్థాయిలో ప్రచారం చేసి మార్కెటింగ్ నిర్వహించి అనేక తెలంగాణ, తెలుగు సంఘాలకు స్ఫూర్తి దాయకంగా నిలిచింది. మాతృదేశంలో రైతుకు అండగా, పేద విద్యార్థులకు ఆర్ధిక ఆసరాగా, అమరవీరుల కుటుంబాలకు బాసటగా అనేక కార్యక్రమాలు నిర్వహించి మార్గదర్శిగా నిలిచింది. ఇక్కడ బ్రిటన్‌లో తెలంగాణ వారి కోసం బతుకమ్మ, బోనాలను నిర్వహిస్తూ వస్తుంది. అలాగే దేశసేవలో భాగంగా స్వతంత్ర్య దినోత్సవం, అంబేడ్కర్, గాంధీ జయంతి వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ తర్వాతి తరం వారికి దేశ భక్తినింపే ప్రయత్నాలు చేస్తుంది. తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ గత ఏడాది నిర్వహించిన బతుకమ్మ పండగకు 1500 మందికి పైగా తెలంగాణవారు హజరయ్యారు. తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్ నూతన కమిటీ వివరాలను పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. సంస్థ కార్యాచరణ, కార్యక్రమాలు అన్ని కూడా నూతన వర్కింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయని, కమిటీకి పూర్తి బాధ్యతలు ఉంటాయని తెలిపారు. నూతన కమిటీ అధ్యక్షులుగా సిక్కా చంద్ర శేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా గోలి తిరుపతి, ప్రవీణ్ రెడ్డిలు, ప్రధాన కార్యదర్శులుగా కాసర్ల నగేష్ రెడ్డి, రంగుల సుధాకర్, సంయుక్త కార్యదర్శులుగా భాస్కర్ పిట్ల, సురేష్ గోపతి, అడ్వైజరీ చైర్మన్‌గా అంతటి ప్రమోద్ గౌడ్, కోశాధికారులుగా రంగు వెంకట్, మర్యాల నరేష్లతో పాటు బ్రిటన్ వ్యాప్తంగా వివిధ నగరాలకు ఇంచార్జీలుగా దాదాపు 70 మందితో కూడిన కమిటీని తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ నియమించింది. బ్రిటన్‌లో తెలుగు తెలంగాణ సంఘాల్లో మొట్ట మొదటి భారీ కార్యవర్గం ఇదే అని సంస్థ తెలిపింది. 'చేనేత చేయూత' తో పాటూ ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో ' ఒక ఎన్ఆర్ఐ కుటుంబం ఒక రైతు కుటుంబం దత్తత' కార్యక్రమం రూపొందిస్తామని త్వరలో రైతు సహాయార్ధం ప్రణాళిక రూపొందిస్తామని నూతన కార్యవర్గం తెలిపింది. నూతన కమిటీ అధ్యక్షులు సిక్కా చంద్ర శేఖర్ గౌడ్