తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ నూతన కార్యవర్గం ఏర్పాటు | Telangana NRI Forum new Executive Committee | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ నూతన కార్యవర్గం ఏర్పాటు

Published Fri, Apr 28 2017 4:11 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ నూతన కార్యవర్గం ఏర్పాటు

తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ నూతన కార్యవర్గం ఏర్పాటు

లండన్ : 
తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ (TeNF ) నూతన కార్యవర్గం ఏర్పాటైంది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలోకి అడుగు పెడుతూ తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్  నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 2012 లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ పని చేసి సంస్కృతి, సేవ , భాషాభివృద్ధి లక్ష్యంగా తమవంతు బాధ్యతగా తెలంగాణలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

2017లో 'చేనేతకు చేయూత' కార్యక్రమం ద్వారా చేనేత వస్త్రాలను విదేశాల్లో మొట్ట మొదటిసారిగా భారీస్థాయిలో ప్రచారం చేసి మార్కెటింగ్ నిర్వహించి అనేక తెలంగాణ, తెలుగు సంఘాలకు స్ఫూర్తి దాయకంగా నిలిచింది. మాతృదేశంలో రైతుకు అండగా, పేద విద్యార్థులకు ఆర్ధిక ఆసరాగా, అమరవీరుల కుటుంబాలకు బాసటగా అనేక కార్యక్రమాలు నిర్వహించి మార్గదర్శిగా నిలిచింది.  ఇక్కడ బ్రిటన్లో తెలంగాణ వారి కోసం బతుకమ్మ, బోనాలను నిర్వహిస్తూ వస్తుంది. అలాగే  దేశసేవలో భాగంగా స్వతంత్ర్య దినోత్సవం, అంబేడ్కర్, గాంధీ జయంతి వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ  తర్వాతి తరం వారికి దేశ భక్తినింపే ప్రయత్నాలు చేస్తుంది.
 
తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ గత ఏడాది నిర్వహించిన బతుకమ్మ పండగకు 1500 మందికి పైగా తెలంగాణవారు హజరయ్యారు. తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ వ్యవస్థాపక చైర్మన్  గంప వేణుగోపాల్ నూతన కమిటీ వివరాలను పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. సంస్థ కార్యాచరణ, కార్యక్రమాలు అన్ని కూడా నూతన వర్కింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయని, కమిటీకి పూర్తి బాధ్యతలు ఉంటాయని తెలిపారు.
 
నూతన కమిటీ అధ్యక్షులుగా సిక్కా చంద్ర శేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా గోలి తిరుపతి, ప్రవీణ్ రెడ్డిలు, ప్రధాన కార్యదర్శులుగా కాసర్ల నగేష్ రెడ్డి, రంగుల సుధాకర్, సంయుక్త కార్యదర్శులుగా భాస్కర్ పిట్ల, సురేష్ గోపతి, అడ్వైజరీ చైర్మన్గా అంతటి ప్రమోద్ గౌడ్, కోశాధికారులుగా రంగు వెంకట్, మర్యాల నరేష్లతో పాటు బ్రిటన్ వ్యాప్తంగా వివిధ నగరాలకు ఇంచార్జీలుగా దాదాపు 70 మందితో కూడిన కమిటీని తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ నియమించింది.
 
బ్రిటన్లో తెలుగు తెలంగాణ సంఘాల్లో మొట్ట మొదటి భారీ కార్యవర్గం ఇదే  అని సంస్థ  తెలిపింది. 'చేనేత చేయూత' తో పాటూ ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో ' ఒక ఎన్ఆర్ఐ కుటుంబం ఒక  రైతు కుటుంబం దత్తత' కార్యక్రమం రూపొందిస్తామని త్వరలో రైతు సహాయార్ధం ప్రణాళిక రూపొందిస్తామని నూతన కార్యవర్గం తెలిపింది.

నూతన కమిటీ అధ్యక్షులు సిక్కా చంద్ర శేఖర్ గౌడ్

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement