చార్మినార్: బోనాలు.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే గొప్ప పండుగ.. ఏపీ, ఢిల్లీతోపాటు అమెరికాలో కూడా వైభవంగా నిర్వహిస్తారు. ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం బోనాలకు రూ.15కోట్లు విడుదల చేసింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత నాలుగేళ్లుగా ఉత్సవాలను కనీవినీ ఎరుగని విధంగా వేడుకలు జరుపుతున్నారు.
ఈసారి బోనాల జాతర వివరాలిలా...
⇔ ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ఈ నెల 15 న గోల్కొండ అమ్మ వారి బోనాలతో ప్రారంభమవుతున్నాయి.
⇔ ఈ నెల 16,17,18లలో లాల్‌దర్వాజ సింహావాహినీ దేవాలయం కమిటి ఆధ్వర్యంలో డిల్లీలో అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించనున్నారు.
⇔ డిల్లీలో జరిగే బోనాల జాతర
ఉత్సవాలకు పలువురు కేంద్ర,రాష్ట్ర మంత్రులతో పాటు అధికార,అనధికార ప్రముఖులు పాల్గొంటారు.
⇔ జూలై 22న విజయవాడ కనక దుర్గా అమ్మవారికి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బోనాల సమర్పణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.
⇔ విజయవాడ బ్రహ్మణ వీధి నుంచి శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం వరకు భజాభజంత్రీలతో, కళా బృందాల నృత్య ప్రదర్శనలతో బోనాల జాతర ఊరేగింపు నిర్వహించనున్నారు.
⇔ బోనంతో పాటు పట్టు వస్త్రాలు, కృష్ణానదిలో గంగా తెప్ప తదితర పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.
⇔ ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ వారికి బంగారు పాత్రలో బోనం సమర్పించనున్నారు.
⇔ జూలై 29వ తేదీన సికింద్రా బాద్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర.
⇔ అదే రోజే పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు.
⇔ శాలిబండలోని కాశీ విశ్వనాథ దేవాలయం నుంచి ఊరేగింపు బయలుదేరుతుంది.
⇔ ఆగస్టు 5వ తేదీన హైదరాబాద్ నగరంతో పాటు పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
⇔ అమ్మవారికి బోనాల సమర్పణ అనంతరం 6వ తేదీన పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు కొనసాగుతుంది.
బంగారు బోనం..పట్టువస్త్రం
ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో ఈసారి సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ నెల 15వ తేదీన గోల్కోండ అమ్మవారికి కమిటీ తరపున బంగారు బోనం, పట్టువస్త్రా లు సమర్పించనున్నారు. అలాగే 17వ తేదీన బల్కంపేట అమ్మవారికి, 20వ తేదీన పెద్దమ్మ గుడి అమ్మవారికి, 24న సికింద్రాబాద్ ఉబ్జయిని మహంకాళి అమ్మవారికి, 26న చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి, 31న లాల్‌దర్వాజా సింహవాహిణి అమ్మవారికి, ఆగస్టు 5న మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించ నున్నారు.
Comments
Please login to add a commentAdd a comment