
మొయినాబాద్ (చేవెళ్ల): బోనాల పండుగ సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమ్మవారికి బోనం సమర్పించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారంలో ఆదివారం వైఎస్సార్‌టీపీ నాయకుడు రాజ్‌గోపాల్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో తన చిన్ననాటి స్నేహితురాలు రజిని కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ ముఖ్యఅధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, నాయకులు ఏపూరి సోమన్న, పిట్ట రాంరెడ్డి, డేవిడ్, అమృతసాగర్, ఇతర నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.