మాట్లాడుతున్న ఏసీపీ తిరుపతిరెడ్డి
మంచిర్యాలక్రైం: శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి అన్నారు. బక్రీద్, తొలి ఏకాదశి, బోనాల పండుగలు వరుసగా ఉన్నందున అన్ని మతాల పెద్దలతో స్థానిక ఏసీపీ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గోవధపై నిషేధం విధించారని, గోవులను అక్రమంగా రవాణా చేసినా, వధించిన చర్యలు ఉంటాయని తెలిపారు. మతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలని, ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే 100డయల్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ రాజు, ఎస్సైలు పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో..
బెల్లంపల్లిరూరల్: ప్రజలు పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య అన్నారు. మంగళవారం సాయంత్రం తాళ్లగురిజాల పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతికమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మత సామరస్యం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ సమావేశంలో బెల్లంపల్లిరూరల్ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో శంకరయ్య, మతపెద్దలు, తాళ్లగురిజాల, వన్‌టౌన్, టూటౌన్ ఎస్సైలు నరేష్, విక్టర్, రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment