కుళ్లిన మాంసం.. కాలం చెల్లిన స్వీట్లు
● బల్దియా అధికారుల తనిఖీల్లో గుర్తింపు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ బల్దియా పారిశుద్ధ్య విభా గం అధికారులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు హోటల్స్, స్వీట్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. కలెక్టర్‌చౌక్‌లోని ఓ హోటల్‌ను తనిఖీ చేసిన అధికారులు కుళ్లిన 6 కిలోల మాంసం, గడ్డ కట్టిన పాడైన చేపల ను గుర్తించారు. వాటిని నిల్వ ఉంచిన ఫ్రీజ్‌లో పురుగులు ఉండటంతో హోటల్ యాజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిన మాంసతో పాటు ఆహా ర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హోటల్ నిర్వాహకుడిని హెచ్చరించి, జరిమానా విధించారు. అనంతరం వినాయక్ చౌక్‌లోని వెంకటేశ్వర స్వీట్‌షాపు, స్వీట్ల తయారీ ప్రాంతం అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. కాలం చెల్లిన స్వీట్లను తయారు చేసిన స్వీట్లతో కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించి, జరిమానా విధించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే చర్యలు తప్పవని పుడ్ ఇన్‌స్పెక్టర్లు ఎం.నరేందర్, బైరి శంకర్‌లు హెచ్చరించారు.