అమ్మవారికి వెండివీణ బహూకరణ
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి దాతలు ఆదివారం వెండివీణ బహూకరించారు. నిజామాబాద్ జిల్లాలోని నవ్యభారతి గ్లోబల్ హైస్కూల్ సంస్థ చైర్మన్ క్యాతం శ్రీదేవి–సంతోష్ దంపతులు రూ.5 లక్షలతో 4 కేజీల వెండితో తయారు చేయించిన వెండి వీణను బహూకరించారు. అర్చకులు దాతలకు తీర్థప్రసాదం అందజేసి వారిని శాలువా కప్పి సత్కరించారు.
చిల్డ్రన్ గ్రౌండ్స్‌లో చీకట్లు
శ్రీరాంపూర్: సింగరేణి చిల్డ్రన్ గ్రౌండ్స్‌లో చీక టి అలుముకుంది. చిన్నపాటి ఏర్పాట్లకు కూ డా అధికారుల నిర్లక్ష్యం వల్ల పిల్లలకు ప్రమాదంగా మారింది. శ్రీరాంపూర్ ఏరియా పరి ధిలోని నస్పూర్ కాలనీలోని రెండు చిల్డ్రన్ ప్లే గ్రౌండ్స్‌లలో లైటింగ్ సమస్య తీవ్రంగా ఉంది. నస్పూర్ కాలనీలోని మనోరంజన్ సముదా యం ఆవరణ, ఆర్కే5 కాలనీ వద్ద గల నందనవనం పార్కులోని చిల్డ్రన్ ప్లే గ్రౌండ్‌లు ఉన్నా యి. పిల్లల కోసం జారుడు బండ, ఉయ్యాలు, రంగుల రాట్నం తదితర ఆటలు ఆడుకోవడానికి ప్లేగ్రౌండ్‌లు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో లైటింగ్ అధ్వానంగా ఉంది. ఉన్న కొన్ని పని చేస్తున్నాయి. మిగతావి చెడిపోయి వెలగడం లేదు. చీకటి పడితే చాలు పిల్లలు ఆడుకోవడానికి భయపడుతున్నారు. వేసవి కావడంతో సాయంత్రం వేళ పిల్లలతో మైదానాలు కిక్కిరిపోస్తున్నాయి. మరో పక్క పక్కనే చెట్ల పొదలు ఉండటంతో విషకీటకాలు, విషసర్పాలు వస్తున్నాయి. దీంతో ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
అమ్మవారికి వెండివీణ బహూకరణ


