
తగ్గుతున్న ఎల్లంపల్లి నీటిమట్టం
ఎల్లంపల్లి జలాశయం
ఎల్లంపల్లి(శ్రీపాదసాగర్) ప్రాజెక్ట్ నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. ఇటు వేసవి కాలం పైగా ఇతర ప్రాంతాల అవసరాలకు నీటిని తరలిస్తుండటంతో తగ్గుతోంది. ప్రాజెక్ట్ మట్టం 148 మీటర్ల క్రస్ట్ లెవెల్ కాగా 143 మీటర్లకు చేరగా 20.175 టీఎంసీలకు గాను 10 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉంది. ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో లేకపోగా అవుట్ ఫ్లో కింద గూడెం ఎత్తిపోతల పథకానికి 290 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ సుజల స్రవంతి పథకానికి 324, ఎన్టీపీసీకి 242, నంది పంప్‌హౌజ్‌కు 3,150 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.
– మంచిర్యాలరూరల్(హాజీపూర్)