బోనాలపై సింగర్ మంగ్లీ పాడిన పాట వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. బోనాల పాటలో అభ్యంతరకర పదాలు వాడారంటూ బీజేపీ కార్పొరేటర్లు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి పాటను తొలగించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మంగ్లీపై కేసు నమోదు చేయాలని పలువురు బీజేపీ కార్పొరేటర్లు సీపీని కోరారు. దీంతో ఈ పాటపై మంగ్లీ వివరణ ఇచ్చింది. ఈ పాటపై విమర్శలు వచ్చిన రోజేనే మార్చేశామని తెలిపారు. గ్రామదేవతను ఎలా పూజిస్తారో తెలుసుకుని విమర్శిస్తే మంచిదని మంగ్లీ పేర్కొన్నారు.
ఇక మంగ్లీ పాటపై సోషల్ మీడియాలోభిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’మంగ్లీ పాటపై డిబేట్ పెట్టింది. ఈ చర్చలో సింగర్ పవన్ కుమార్, సంగీత దర్శకుడు భోలే సావలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంగ్లీ పాడిన పాటలో అంత అసభ్యకరమైన పదాలేమి లేవన్నారు. మోతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థంలో సాగుతుందని, ప్రస్తుతం ఆపదం వ్యతిరేక అర్ధంలో వాడుతున్నామని చెప్పారు. విమర్శలు వచ్చిన నేపథ్యంలో లిరిక్స్ కూడా మార్చారని, పెద్దమనసు చేసుకొని మంగ్లీ క్షమించాలని కోరారు. ఇకపై అలాంటి తప్పులు రాకుండా కళాకారులు చూసుకుంటామని చెప్పారు. ఇంకా డిబేట్‌లో ఏంఏం చర్చించారో వీడియో చూడండి.
Comments
Please login to add a commentAdd a comment