ఆషాఢం ఆరంభం | Importance Of Ashada Masam | Sakshi
Sakshi News home page

ఆషాఢం ఆరంభం

Published Sat, Jul 6 2024 7:36 AM | Last Updated on Sat, Jul 6 2024 7:36 AM

Importance Of Ashada Masam

నేటినుంచి ఆషాఢమాసం ఆరంభం అవుతోంది. ΄పార్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెలకే ఆషాఢమాసం అని పేరు. ఇది సంవత్సరంలో నాలుగవ మాసం. దీనిని శూన్యమాసమని కూడా అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలయేది ఈ మాసంలోనే. 

పేరుకు శూన్యమాసమే అయినా పూరీ జగన్నాథ రథయాత్ర నుంచి తొలి ఏకాదశి, గురు పూర్ణిమ, గ్రామ దేవతలకు సమర్పించే బోనాలు ఈ మాసంలోనే. ఆషాఢ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడంలో చేసే సముద్ర, నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ;పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం శుభకరం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement