శూన్యమాసం...
తెలుగు సంవత్సరాల్లో నాలుగో నెల ఆషాఢం. పూర్వాషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢ మాసం. ఈ మాసంలోనే వర్షఋతువు ప్రారంభమవుతుంది. పౌర్ణమి రోజున చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెలగా తెలియజేస్తారు. ఉత్తరాయన పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం ప్రారంభమైన మాసం కనుక ఆషాఢ మాసం శూన్యమాసం. ఈమాసంలో గృహప్రవేశం వివాహం వంటి శుభకార్యాలు చేయకూడదని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయి తే దేవతారాధనలకు, శక్తి ఆరాధనలకు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.
పర్వదినాలు ప్రారంభం
ఆషాఢం అనే పదం ‘ఆది’ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. ఆది అనగా శక్తి అనే అర్థాన్ని తెలియజేస్తుంది. కావున ఆషాఢ మాసంలో దేవతల ను పూజించడం అనేది పరమ పవిత్ర కార్యమని భ క్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ మాసంలో పవిత్రమై న పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకీసేవలు అధికంగా జరుగుతుంటాయి. దేశంలోని ప్రముఖ మైన పూరి జగన్నాథుని రథయాత్ర సైతం ఆషాఢమాసంలోనే జరగడం విశేషం. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటా రు. తొలి ఏకాదశి నుంచి పండుగలు ప్రారంభమవుతాయి. ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున మహావిష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఆషాఢ శుద్ధపౌర్ణమి రో జున గురుపౌర్ణమిగా పరిగణిస్తారు. ఈ మాసంలో స్కంద పంచమి, ‘దక్షిణాయన పుణ్యకాలం’ కూడా ప్రారంభమవుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ప్ర తిష్టాత్మకంగా నిర్వహించే బోనాల ఉత్సవాలు ఆ షాఢంలోనే అంగరంగ వైభవంగా ఆరంభమవుతా యి. వర్షాకాలం రాకతో ఈ ఉత్సవాలు ప్రారంభం కావడం కొంత శాసీ్త్రయతను సైతం కలిగి ఉంటాయి.
అత్తారింటి నుంచి పుట్టింటికి..
కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు ఆషాఢమాసంలో అత్తారింటి నుంచి పుట్టింటికి వెళ్తారు. ఆషాఢంలో అత్తాకోడళ్లు ఒకరినొకరు చూసుకోకూడదని సంప్రదాయబద్ధంగా వస్తోంది. కొత్తగా పైళ్లె అత్తారింట్లో అడుగిడిన అమ్మాయిలు తల్లిదండ్రులపై బెంగతో ఉంటారు. వీరు ఆషాఢమాసంలో పుట్టింటికి వెళ్లి తోబుట్టువులు, స్నేహితురాళ్లతో కలిసి వేడుకలు జరుపుకుంటారని ప్రతీతి.
గోరింట మెరుపులు
గోరింటాకును అతివలు అమితంగా ఇష్టపడతారు. వాటిని తమ అరచేతుల్లో వేసుకుని ఎర్రగా పండితే మురిసిపోతారు. ఏ పర్వదినాలకై నా శుభకార్యానికై నా గోరింటాకు ఉండాల్సిందే. ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. గ్రీష్మ రుతువు అనంతరం వర్ష రుతువులో ఆషాఢ మాసం వస్తుంది. ఈ సమయంలో గ్రీష్మ రుతువులో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. ఈ కారణంగా గోరింటను అరచేతుల్లో ధరిస్తే శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. చర్మ సమస్యలు కూడా దరి చేరవు. గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తిని కలిగి ఉండడంతో పాటు రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుంది. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వలన సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment