నాలుగో బెటాలియన్‌లో ఘనంగా లష్కర్‌ బోనాలు | The fourth battalion solid Lashkar Bonalu | Sakshi
Sakshi News home page

నాలుగో బెటాలియన్‌లో ఘనంగా లష్కర్‌ బోనాలు

Published Mon, Jul 25 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

నాలుగో బెటాలియన్‌లో ఘనంగా లష్కర్‌ బోనాలు

నాలుగో బెటాలియన్‌లో ఘనంగా లష్కర్‌ బోనాలు

మామునూరు : ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని హన్మకొండ మండలం మామునూరు టీఎస్‌ఎస్‌పీ నాలుగో బెటాలియన్‌ ముత్యాలమ్మ దేవాలయంలో ఆదివారం సాయంత్రం లష్కర్‌ బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నారాయణమూర్తి, బెటాలియన్‌ ఇన్‌చార్జి కమాండెంట్‌ పి. శ్రీనివాస్‌కుమార్, గుడినిర్మాణ కమిటీ బాధ్యుడు గంగునాయక్‌ పర్యవేక్షణలో పోలీసు కుటుంబాలు, లక్ష్మీపురం కాలనీ మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ముత్యాలమ్మకు కల్లుశాకం ఆరబోసి, కోళ్లు, మేకలు బలిచ్చి కొబ్బరికాయలు కొట్టి భక్తి శ్రద్ధలతో పూజించారు. కాగా, వేడుకల్లో చిన్నారులు, పోలీసు సిబ్బంది పోతరాజుల వేషధారణలతో అలరించారు. కార్యక్రమంలో బీజే వైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి జలగం రంజిత్, టీఎస్‌ఎస్‌పీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
మొగిలిచర్లలో మారెమ్మ బోనాలు
వరంగల్‌ : నగరంలోని రెండో డివిజన్‌ మొగిలిచర్ల గ్రామంలో ఆదివారం మారెమ్మ బోనాలను గంగపుత్రులు వైభవంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు వడ్డెబోయిన రవీందర్, నాయకులు గబ్బెట సురేష్, స్వామి, రామస్వామి, పరుశరాములు, శ్రీనివాస్, రాజ్‌కుమార్, లక్ష్మీ, సరళ, విజయ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement