
Rashmika Gives Surprise To Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. దీంతో కాస్తా పుష్ప షూటింగ్‌కు బ్రేక్ పడగా ప్రమోషన్ కార్యక్రమాల్లో మూవీ టీం బిజీగా ఉంది. త్వరలో టీజర్, డిసెంబర్ 17న ‘పుష్ప.. ది రైజ్’ పార్ట్ 1 విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో రష్మిక అల్లు అర్జున్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. త్వరలో పుష్ప మూవీ విడుదల కాబోతోన్న నేపథ్యంలో బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపింది.
చదవండి: వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో!
‘మూవీ త్వరలో విడుదల కాబోతోంది కదా సార్.. స్పెషల్‌గా ఏదైన పంపించాలనిపించింది. అందుకే ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్ మీ కోసం’ అంటూ చేతితో రాసి నోట్‌తో పాటు కొన్ని వస్తువులను బాక్స్‌లో పెట్టి పంపించింది. దీనిని అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ రష్మికకు ధన్యవాదాలు తెలిపాడు. అవి చూస్తుంటే పుష్ప షూటింగ్‌లో ఉపయోగించిన చిన్న చిన్న వస్తువులను అందంగా అలంకరించి రష్మిక గిఫ్ట్ పంపినట్లు ఉందంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మరి ఆ స్పేషల్ గిఫ్ట్ ఏంటో మీరు కూడా ఓసారి చూసేయండి..
చదవండి: పుష్ప ట్రైలర్ టీజ్ అవుట్, మామూలుగా లేదుగా..
చదవండి: రాజ‘శేఖర్’ మూవీకి ఓటీటీ షాకింగ్ రేట్స్!
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ముత్తమ్ శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సునీల్ మంగళం శ్రీనుగా కనిపించబోతుండగా..ఇప్పటికే విడుదలైన లుక్ స్టన్నింగ్‌గా ఉంది. మరోవైపు యాంకర్ , నటి అనసూయ దాక్షాయణి పాత్రలో నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.