![Benjamin Netanyahu to Present Special Gift to His Friend Modi - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/4/modi-Netanyahu-twitter.jpg.webp?itok=Nv0vbqOE)
జెరూసలేం : తన స్నేహితుడు ప్రధాని నరేంద్రమోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వనున్నారు. త్వరలో ఆయన భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ విలువైన గిఫ్ట్‌ను మోదీకి అందించనున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల (జనవరి) 14న నెతన్యాహు పర్యటన ప్రారంభం కానుంది. ఆ రోజే మోదీకి గాల్ మొబైల్ వాటర్ డిసాలినైజేషన్-ప్యూరిపైడ్ జీప్‌ను అందిస్తారు. ఈ జీప్‌నకు ఓ ప్రత్యేకత ఉంది.
గత ఏడాది (2017) జులై నెలలో మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు వారిద్దరు కలిసి ఈ జీపులోనే సముద్రపు తీరంలో షికారు చేశారు. దీంతో వారి స్నేహానికి గుర్తుగా ఆయన మోదీకి ఆ జీపునే బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ జీపు ఖరీదు దాదాపు లక్షా పదకొండువేల డాలర్లు ఉంటుందని అంచనా. సముద్రపు నీటిని శుద్ధిపరిచే సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు ఇజ్రాయెల్ అందించేలా ఒప్పందం అయిన విషయం తెలిసిందే. దీనికి గుర్తుగానే ఓల్గా బీచ్‌లో మోదీ, నెతన్యాహు కలిసి సముద్రపు నీటిని శుద్ధి పరిచే జీపులో కాసేపు సరదాగా గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment