
ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్
బీటౌన్‌లో ప్రియాంకా చోప్రా పేరు ప్రస్తావనకు వస్తే చాలు. ఆమె చేయనున్న సినిమా విషయాలు పక్కనపెట్టి ప్రేమ గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అంతలా అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌తో కలిసి ప్రియాంక చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. న్యూయార్క్ వెకేషన్‌లో వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడమే వీరి ప్రేమకు నిదర్శనం అనొచ్చు. రీసెంట్‌గా ముంబైలో జరిగిన ఓ వెడ్డింగ్ ఫంక్షన్‌కు కూడా నిక్ వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నెల 18న ప్రియాంక బర్త్ డే. 36వ వసంతంలోకి అడుగుపెడతారట ఈ బ్యూటీ. ఈ బర్త్ డే స్పెషల్‌గా ప్రియాంకా చోప్రాకి నిక్ ఏదో స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేశారట. ఆ సర్‌ప్రైజ్ ఏంటీ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. బర్త్‌డే సెలబ్రేషన్స్ తర్వాత ప్రియాంకాకు ఇష్టమైన బీచ్‌కు నిక్ ఆమెను తీసుకెళ్తార ట. అసలు ఈ బర్త్‌డే స్పెషల్ ఎంటీ? అనేది తెలియాలంటే ఈ నెల 18 వరకు వెయిట్ చేయాల్సిందే. రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రియాంక బాలీవుడ్‌లో ‘భారత్, ది స్కై ఈజ్ పింక్’ చిత్రాల్లో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment