అనుష్కకు గుణశేఖర్ స్పెషల్ గిఫ్ట్!
అనుష్కకు గుణశేఖర్ స్పెషల్ గిఫ్ట్!
Published Tue, Nov 4 2014 11:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
చెన్నై: దక్షిణాది నటి అనుష్క శెట్టికి 'రుద్రమదేవి' చిత్ర నిర్మాతలు ఓ ప్రత్యేక వీడియోను పుట్టిన రోజు కానుకగా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రత్యేక వీడియోలో ఏముంటుందనే విషయాన్ని దర్శకుడు గుణశేఖర్ సీక్రెట్ గా ఉంచారు. నవంబర్ 7 తేదిన అనుష్క 33వ జన్మదినం జరుపుకోనున్నారు.
అనుష్క పుట్టిన రోజున ఓ ప్రత్యేక గిఫ్ట్ ను ప్లాన్ చేశారు. ఓ స్పెషల్ వీడియో లేదా సినిమా టీజర్ కావోచ్చు. పుట్టిన రోజున అనుష్కకు సర్ ప్రైజ్ చేయాలని గుణశేఖర్ ప్లాన్ చేశారు.. కానుక ఏమిటనే విషయాన్ని గుణశేఖర్ చాలా సీక్రెట్ గా ఉంచారు అని చిత్ర నిర్వహకులు వెల్లడించారు. కాకతీయుల వంశానికి చెందిన కథానేపథ్యంతో రుద్రమదేవి చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement