అనుష్క జన్మదిన కానుకగా 'రుద్రమదేవి ఫస్ట్ | Anushka to get 'Rudhramadevi' first look as birthday gift | Sakshi
Sakshi News home page

అనుష్క జన్మదిన కానుకగా 'రుద్రమదేవి ఫస్ట్

Published Wed, Nov 6 2013 1:15 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM

అనుష్క జన్మదిన కానుకగా 'రుద్రమదేవి ఫస్ట్

అనుష్క జన్మదిన కానుకగా 'రుద్రమదేవి ఫస్ట్

ప్రముఖ టాలీవుడ్ నటి అనుష్క జన్మదిన కానుకగా ఆమె నటించిన తాజా చిత్రం రుద్రమదేవికి సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాణ బృందం బుధవారం చెన్నైలో వెల్లడించింది. ఆ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలకు అంతకంటే మంచి సమయం లేదని అభిప్రాయపడింది. అనుష్క గురువారం జన్మదినం జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో జన్మదిన కానుకగా అనుష్కకు రుద్రమదేవి ఫస్ట్లుక్ను బహుమతిగా అందజేయాలని తామంతా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

అనుష్కకు ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కానుకగా ఇవ్వడం ద్వారా ఆమె అభిమానులు సంతోషిస్తారని పేర్కొంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రానా దగ్గుపాటి, సుమన్, ప్రకాశ్ రాజ్, బాబాసెగల్, అదితి చెంగప్ప, నిత్యమీనన్, ఆదిత్య మీనన్ తదితరలు నటిస్తున్నారు. అయితే ఇప్పటికే అనుష్క నటించిన రుద్రమదేవి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అవి సామాజిక అనుసంధాన వేదికలో దర్శనమిచ్చాయి. అయితే ఆ ఫోటోలు అనుష్క నటించిన రుద్రమదేవి చిత్రానికి సంబంధించినవి కావని ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఖండించిన విషయం విదితమే.అనుష్క రుద్రమదేవి చిత్రంలో నటించేందుకు దాదాపు 15 కేజీలు బరువు తగ్గింది. అలాగే గుర్రపు స్వారీ, కత్తి యుద్దాలను కఠోర శ్రమకోర్చి నేర్చుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement