కొత్త సినిమాతో అనుష్క.. భయపెట్టేలా ఫస్ట్ లుక్ | Anushka Shetty Upcoming Ghaati Movie First Look Poster Released, Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Anushka Shetty: డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో అనుష్క

Published Thu, Nov 7 2024 9:55 AM | Last Updated on Thu, Nov 7 2024 10:38 AM

Anushka Shetty Ghaati Movie First Look

'బాహుబలి' తర్వాత అనుష్క సినిమాలు చేయడంలో పూర్తిగా నెమ్మదించింది. ఒకటి అరా మూవీస్ చేస్తూ వస్తోంది. గతేడాది సెప్టెంబరులో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత ఏమైపోయిందో, ఏం చేస్తుందో తెలియదు. ఇప్పుడు ఈమె పుట్టినరోజు సందర్భంగా కొత్త మూవీ డీటైల్స్ బయటకొచ్చాయి. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?)

'హరిహర వీరమల్లు' లేట్ అవుతూ వచ్చేసరికి ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసిన డైరెక్టర్ క్రిష్.. అనుష్కని లీడ్ రోల్‌గా పెట్టి సినిమా తీస్తున్నాడు. దీనికే ఇప్పుడు 'ఘాటీ' టైటిల్ నిర్ణయించారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బాధితురాలే క్రిమినల్ అయితే? అనే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

తల, చేతికి రక్తంతో చుట్ట తాగుతూ.. భయపెట్టేలా అనుష్క ఫస్ట్ లుక్ ఉంది. సాయంత్రం 4:05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. ఇది పాన్ ఇండియా మూవీనే. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దీన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. బహుశా ఫిబ్రవరి లేదా మార్చిలో థియేట్రికల్ రిలీజ్ ఉండొచ్చేమో?

(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement