తెర మీదే కాదు.. వెనకా హీరోనే! | ss rajamouli praises bunny as a hero on screen and off screen too | Sakshi
Sakshi News home page

తెర మీదే కాదు.. వెనకా హీరోనే!

Published Sat, Oct 10 2015 3:04 PM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

తెర మీదే కాదు.. వెనకా హీరోనే!

తెర మీదే కాదు.. వెనకా హీరోనే!

రుద్రమదేవి సినిమా మీద, అందులో ప్రధాన పాత్రలు పోషించిన అల్లు అర్జున్, అనుష్కల మీద దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. తెరమీద, తెర వెనక కూడా బన్నీ అసలైన హీరో అనిపించుకున్నాడంటూ మెచ్చుకున్నారు. ఈ విషయాలను ట్విట్టర్ ద్వారా అభిమానులందరికీ జక్కన్న షేర్ చేశారు. ఆయన ఏమన్నారంటే...

''ఎక్కడ చూసినా గోన గన్నారెడ్డే. సినిమా దాదాపు ఆగిపోతోంది అనిపించినప్పుడు బన్నీ ప్రవేశం ఒక్కసారిగా దాన్ని పునరుద్ధరించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకు వినోదపన్ను మినహాయింపు ఇవ్వడానికి ప్రధాన కారణం బన్నీయేనని తెలిసింది. తెరమీద కూడా అద్భుతంగా చేశాడు. తెరమీద, తెర వెనక కూడా తానే హీరో అనిపించుకున్నాడు. అందుకు గోన గన్నారెడ్డిని గౌరవించి తీరాల్సిందే.

ఇక స్వీటీ.. నీ నిబద్ధత, నిజాయితీలు చూస్తే.. సినీ పరిశ్రమకు నువ్వో వరం అనిపిస్తుంది. రుద్రమదేవి పాత్రను వేరే ఎవ్వరూ పోషించలేరు. వీరభద్ర, రుద్రమదేవి మధ్య మరింత స్క్రీన్ టైమ్ ఉంటే మరింత బాగుండేదేమో అనిపించింది. కానీ రానా తన ప్రెజెన్స్ సినిమాలో బాగా చూపించుకున్నాడు. చారిత్రక సినిమాలు తీయాలనుకునే దర్శకులకు అతడు అద్భుతంగా ఉపయోగపడతాడు. శివదేవయ్య మరిన్ని రాజకీయ క్రీడలు ఆడి ఉంటే బాగుండేది. అయితే, ప్రకాష్ రాజ్ తానేంటో చూపించుకోడానికి అది చాలు. గుణశేఖర్, ఆయన బృందం మొత్తానికి అభినందనలు. ఇంత పెద్ద సినిమాను ప్రయత్నించి, రూపొందించి, విడుదల చేసి, బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్నందుకు అభినందనలు.''

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement