'రుద్రమదేవి'కి ప్రముఖుల అభినందనలు | Tollywood celebrities best wishes for rudhramadevi release | Sakshi
Sakshi News home page

'రుద్రమదేవి'కి ప్రముఖుల అభినందనలు

Published Fri, Oct 9 2015 11:31 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

'రుద్రమదేవి'కి ప్రముఖుల అభినందనలు - Sakshi

'రుద్రమదేవి'కి ప్రముఖుల అభినందనలు

 రుద్రమదేవి సినిమాకు ప్రముఖుల నుంచి సపోర్ట్ అందుతోంది. గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం భారీగా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు, చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనుష్కతో బాహుబలి సినిమాలో కలిసి నటిస్తున్న ప్రభాస్, గుణశేఖర్ తో పాటు రుద్రమదేవి టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సినిమాలో గోనగన్నారెడ్డిగా కీలక పాత్రలోనటించిన అల్లు అర్జున్ రుద్రమదేవి రిలీజ్పై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమాకు వినోదపన్ను మినహాయింపు ఇచ్చినందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్కు కృతజ్ఞతలు తెలియజేశాడు.

బాహుబలి లాంటి భారీ సినిమాను అందించిన దర్శకధీరుడు రాజమౌళి కూడా రుద్రమదేవి టీంను అభినందించాడు. ఎన్నో కష్టనష్టాలకోర్చి రుద్రమదేవి సినిమాను రిలీజ్ చేసిన గుణశేఖర్ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణతో పాటు ఆంద్రప్రదేశ్లోనూ ఈ సినిమాకు వినోదపన్ను రాయితీ కల్పించాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement