gunashekar
-
రానా సినిమాలో త్రివిక్రమ్ ఎంట్రీ కోపంతో రగిలిపోతున్న గుణశేఖర్
-
శాకుంతలం మెప్పించిందా..?నొప్పించిందా..?
-
‘శాకుంతలం’ నా మొదటి అడుగు!: ‘దిల్’ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘‘రాజమౌళి ‘బాహుబలి’ని పాన్ ఇండియాకి, ‘ఆర్ఆర్ఆర్’ని మొత్తం ప్రపంచానికి చూపించారు. మన తెలుగు సినిమాలు ప్రపంచానికి చూపిస్తూనే ఉండాలి.. దాని కోసం నా మొదటి అడుగు ‘శాకుంతలం’. ఇది మన ఇండియన్ సినిమా అని తర్వాతి తరానికి తెలియాలి. ఈ మూవీ ప్రేక్షకులను నిరుత్సాహపరచదు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సమంత లీడ్ రోల్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకుంతలం’. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. మంగళవారం ఈ చిత్రం త్రీడీ ట్రైలర్‌ని విడుదల చేశారు. చదవండి: అమెరికాలో లయ శాలరీ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ..‘‘గుణశేఖర్‌గారికి సాయం చేయడానికి నేను ఈ మూవీలో భాగమయ్యాను’ అని అందరూ అనుకుంటారు. కానీ, గుణశేఖర్‌గారు మోస΄ోయారు.. నేను స్వార్థంతో ఈ మూవీలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే తెలుగు సినిమా గ్లోబల్ వరకూ వెళ్లింది. భవిష్యత్‌లో నేను కూడా ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న గొప్ప సినిమాలు తీయాలంటే పని నేర్చుకోవాలి. అందుకే ‘శాకుంతలం’లో చేరాను’’ అన్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘‘ఇది సమంతగారి ‘శాకుంతలం’. శకుంతల పాత్రకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు’’ అన్నారు. ‘‘మైథాలజీలో త్రీడీలో వస్తున్న తొలి చిత్రం ‘శాకుంతలం’. ప్రేక్షకులందరూ ఈ మూవీని త్రీడీలో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు నీలిమ గుణ. చదవండి: బర్త్‌డే రోజున చరణ్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా? -
‘శాకుంతలం’ అప్డేట్స్ : సెట్స్‌పైకి ఎప్పుడంటే..
నెలాఖరులో సెట్స్‌కి... కథానాయిక సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. సమంత కెరీర్లో తొలిసారిగా చేస్తున్న ఈ మైథాలాజికల్ మూవీని ప్రముఖ దర్శకులు గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శాకుంతల పాత్రధారిగా సమంత, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఈ చిత్రం షూటింగ్‌ని జరిపారు. లాక్‌డౌన్‌తో బ్రేక్ వేయక తప్పలేదు. అయితే ఈ నెలాఖరున ‘శాకుంతలం’ చిత్రీకరణను మళ్లీ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో ఈ చిత్రీకరణ ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ యాభై శాతం పూర్తయింది. ఈ కొత్త షెడ్యూల్లో సమంత, దేవ్మోహన్లకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ‘దిల్’ రాజుతో కలసి గుణ శేఖర్ తనయ నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
పూజ కార్యక్రమం జరుపుకున్న సమంత కొత్త మూవీ
అక్కినేని కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ పూజ కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా చిత్ర యూనిట్ సోమవారం షేర్ చేసింది. ఈ సందర్భంగా వచ్చే వారం నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ జరగనున్నట్లు వెల్లడించింది. ఇందులో టైటిల్ రోల్ సమంత పోషిస్తుండగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ కనిపించనున్నట్లు మూవీ యూనిట్ స్పష్టం చేసింది. అనుష్కతో ‘రుద్రమదేవి’ వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గుణశేఖర్ సమంతతో ‘శాకుంతలం’ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కిస్తుండంతో దీనిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఎపిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘శాకుంతలం’ను తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. #Shaakuntalam ❤️❤️❤️@Samanthaprabhu2 @neelima_guna @Gunasekhar1 #DilRaju #Shaakuntalam #mythology #epiclovestory pic.twitter.com/gSsTVY8Snh — Dev Mohan (@ActorDevMohan) March 15, 2021 -
‘రేసుగుర్రం’ రేసులో లేదా?
2014, 2015, 2016 సంవత్సరాలకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించడం, ఎంపిక పారదర్శకంగా జరగలేదని విమర్శలు రావడం తెలిసిందే. ఈ విషయమై నిర్మాతలు కె. వెంకటేశ్వరరావు, నల్లమలుపు బుజ్జి, దర్శకుడు గుణశేఖర్ గురువారం మీడియాతో మాట్లాడారు. మెగాఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేదు – నిర్మాత కె. వెంకటేశ్వరరావు అల్లు అర్జున్ హీరోగా నేను, నల్లమలుపు బుజ్జి 2014లో నిర్మించిన ‘రేసుగుర్రం’ ఎంత హిట్ అయిందో.. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలిసిందే. ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. బెస్ట్ కొరియోగ్రాఫర్, ‘సినిమా చూపిస్త మామ...’ సాంగ్‌కు బెస్ట్ సింగర్ అవార్డులనూ సైమా ఇచ్చింది. అంత మంచి సినిమాకు నంది అవార్డు రాకపోవడం అన్యాయం. ఏపీ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన నంది అవార్డులు ఇచ్చిందో అర్థం కావడం లేదు. మంచి జ్యూరీ మెంబర్స్‌ని నియమించి, సినిమాను ఒకటికి నాలుగు సార్లు చూడాలి. 24 క్రా‹ఫ్ట్స్ పరిశీలించి, బాగున్న దానికి అవార్డులు ఇస్తే మాలాంటి నిర్మాతలకు ఆనందంగా ఉంటుంది. నంది అవార్డులు మాకే రావాలని కాదు. బెస్ట్ మూవీకి రావాలన్నదే మా అభిప్రాయం. అవార్డుల కోసమే అయితే ప్రెస్‌మీట్ పెట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘నంది అవార్డుల కోసం రోడ్డు మీద పడకండి’ అని నిర్మాత సి.కల్యాణ్ అనడం తప్పు. ఆయన తీసిన సూపర్ హిట్ సినిమాకు అవార్డు రాకపోతే ఆ బాధ తెలుస్తుంది. ‘రుద్రమదేవి’ సినిమాకు సరైన అవార్డులు రాలేదు. నాగేశ్వరరావుగారు నటించిన ‘మనం’ చిత్రానికి కూడా అవార్డు ఇవ్వకపోవ డాన్ని అన్యాయంగానే భావిస్తున్నాం. ‘రుద్రమదేవి’, ‘మనం’, ‘బాహుబలి’ వంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా లకు సరైన అవార్డులు రాలేదు. కమిటీ మెంబర్లు ఇంకా బాగా ఆలోచిస్తే మిగతా సినిమాలకీ మంచి అవార్డులు వచ్చేవి. మంచి సినిమాలకు అవార్డుల కోసం లాబీయింగ్ చేయాల్సిన అవసరం లేదు. జ్యూరీ మెంబర్స్‌ని తప్పుపట్టడం లేదు. మాకు అర్హత ఉన్నా అవార్డులు రాలేదని చెబుతున్నాం. ఇందులో మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. కడుపు మండి వచ్చాను! – నల్లమలుపు బుజ్జి మంచి విజయం సాధించిన ‘రేసుగుర్రం’ సినిమాను పక్కన పెట్టి ఏవేవో సినిమాలకు అవార్డులు ఇచ్చారు. నంది అవార్డుల కమిటీ, ప్రభుత్వం సినిమాల ఎంపికలో వన్‌సైడెడ్‌గా ఆలోచించారు. వాళ్ల ఇష్టం వచ్చిన వాళ్లకు ఇచ్చారు. కొంతమంది నిర్మాతలు పిచ్చిగా మాట్లాడుతున్నారు. నా కెరీర్లో 24క్రాఫ్ట్స్‌లో సూపర్‌గా తీసిన సినిమా ‘రేసుగుర్రం’. కంటి తుడుపు అవార్డులు ఇచ్చారు. అవార్డులను పంచుకున్నారా? ఏపీ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నా. ప్రజలు మెచ్చిన సినిమాలను ప్రభుత్వం గుర్తించి అవార్డులు ఇస్తే ఇంకా మంచి సినిమాలు తీయాలని నిర్మాతలకు అనిపిస్తుంది. జ్యూరీ మెంబర్స్ కూడా ఆలోచించుకోండి. ఎప్పుడూ ప్రెస్‌మీట్‌కి రాని నేను... కడుపు మండి వచ్చాను. పబ్లిసిటీ కోసం కాదు. ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్ బాగా నటించారు. హీరో సినిమాను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు సడన్‌గా ఒక కమెడియన్ వచ్చి కాసేపు స్క్రీన్ మీద ఉంటే సినిమా మొత్తం మారిపోతుందా? అవార్డుల ఎంపిక కమ్మ లాబీయింగ్లా ఉంది. ఏంటిది? అని ప్రశ్నించడానికే ఈ ప్రెస్‌మీట్. ఎవరి మీదా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. నా సినిమాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. క్యాస్ట్ గురించి తేవడం కరెక్ట్ కాదు కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘మొత్తం అవార్డులు చూస్తే ఆ విషయం తెలుస్తుంది సార్’ అన్నారు. అవార్డుల ఎంపిక సరైన ప్రామాణిక అంశాలతోనే జరిగిందా? అన్న ప్రశ్నకు.. ‘మొత్తం దొంగ అవార్డులే అన్నారు. మరి, ఆ అవార్డుల కోసం ఎందుకు అడుగుతున్నారనే ప్రశ్నకు.. సినిమా ఉంది కాబట్టే అడుగుతున్నాం. ‘బాహుబలి’ సినిమాకి ఉత్తమ నటుడిగా ప్రభాస్‌కు ఎందుకు అవార్డు రాలేదు? గుణశేఖర్ ‘రుద్రమదేవి’ సినిమాకు అర్హత లేదా? ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చుకుంటారు. కానీ, ‘రుద్రమదేవి’కి ఇవ్వరు. మాకు వాళ్ల మీద వ్యతిరేకత ఏముంటుంది? గవర్నమెంట్ ఎవరిదో అందరికీ తెలుసు’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ... అల్లు అర్జున్ సినిమా షూట్లో బిజీగా ఉన్నారు. ఆయనకు ఈ ప్రెస్‌మీట్ గురించి తెలియదు. ‘మనం’కు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ, సరైన అవార్డు రాలేదు’ అన్నారు. పునర్జన్మల కథలకు నంది అవార్డులు ఇవ్వరు కదా? అన్న ప్రశ్నకు... ‘ఈగ’కు నేషనల్ అవార్డు, నంది అవార్డు ఇచ్చారు కదా. కనీసం జరిగిన తప్పులను సరిదిద్దుకోండి. మా ఆవేదన జ్యూరీ సభ్యులకు తెలియాలనుకున్నాం. ఈ ప్రెస్‌మీట్‌తో సాధించేది ఏమీ లేదు. టీడీపీ ప్రభుత్వం అని కాదు.. ఏ ప్రభుత్వం ఉన్నా అన్యాయం అన్యాయమే. నేను సినిమా వాడిని. సినిమాల గురించి చెప్తున్నాను. జ్యూరీ చేసిన తప్పులను చెప్తున్నాను. ప్రభుత్వం చేసిన తప్పులను చెప్తున్నాను. మాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు అని చెప్తున్నాం. నేను క్యాస్ట్‌ల గురించి మాట్లాడటం లేదు. లాబీయింగ్ జరిగింది. మాకు లాబీయింగ్ చేయడం చేతకాదు’ అన్నారు. అప్పుడు నన్నూ విమర్శించారు – గుణశేఖర్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు అమరావతి ప్రారంభోత్సవం సమయంలో... ‘‘రుద్రమదేవి మూలాలు ఉన్న అమరావతి శంకుస్థాపన నా చేతుల మీదగా జరగడం ఆనందంగా ఉంది’’ అన్నారు. అలా రుద్రమదేవి గొప్పతనాన్ని చెప్పిన ఏపీ ప్రభుత్వం ఆమె జీవితం ఆధారంగా తీసిన సినిమాకి పన్ను మినహాయింపు, అవార్డులు ఇవ్వలేదని గుణశేఖర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదేదో అవార్డులు రాని సంఘం కాదు. మేం గ్రూప్ కట్టలేదు. బుధవారం ఓ ప్రముఖ టీవీ చానెల్లో డిబేట్ జరుగుతున్నప్పుడు గౌరవ జ్యూరీ సభ్యులు ఒక ఇష్యూని లేవనెత్తారు. దాని గురించి ప్రస్తావించాలని వచ్చా. అందులో ఒక జ్యూరీ మెంబర్ని.. అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ అవార్డు ఇచ్చారని ప్రశ్నించినప్పుడు... ‘కావాలని ఇవ్వలేదు. ఆ డైరెక్టర్ ఆ విభాగంలో ఆప్లై చేశారు కాబట్టే ఇచ్చాం’ అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆప్లై చేశారా? అని చాలా మంది ఫోన్లు చేసి అడిగారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆప్లై చేశానన్నది వాస్తవం కాదు. ఇదే గోనగన్నారెడ్డి పాత్రకు సపోర్టింగ్ ఆర్టిస్టుగానే సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాం. ఒక్క ఏపీ ప్రభుత్వమే అల్లు అర్జున్‌లాంటి హీరోను క్యారెక్టర్ ఆర్టిస్టు అని చెప్పింది. దానిని గౌరవంగా తీసుకోవాలా..? లేక అవార్డు వచ్చినందుకు (ఏస్వీ రంగారావు అవార్డు) ఆనందపడాలో అర్థం కావడం లేదు. ప్రూఫ్‌తో సహా వచ్చాను. సహాయ నటుడు విభాగంలోనే అల్లు అర్జున్ పేరు రాశా. ‘రుద్రమదేవి’ తెలంగాణకు చెందిన చిత్రం కాబట్టి పన్ను మినహాయింపు, అవార్డు ఇవ్వలేదని కొందరన్నారు. రుద్రమదేవి జాతీయ నాయకురాలు. రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఒకే విధంగా ‘రుద్రమదేవి’ చిత్రానికి పన్ను మినహాయింపు కోసం ప్రయత్నించాను. తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఏపీ ప్రభుత్వం కూడా స్పందిస్తుందనుకున్నా. సమాచార లోపం లేకుండా మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుగార్ల చేత ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాను. బహిరంగంగా విమర్శించకుండా లేఖ రాశాను. ఆ లేఖకు స్పందన లేదు. నేనో పెద్ద నిర్మాతను కాననా? నంది అవార్డుల ఎంపికలో ‘టామీ’ సినిమాకు ఇచ్చిన స్థాయి ‘రుద్రమదేవి’కి లేదా? జ్యూరీ మెంబర్స్‌ని మెప్పించలేకపోయిందా? ‘మీరు పన్ను మినహాయింపుకు ఓ ప్రశ్న అడిగారు. జవాబు ఇప్పుడు వచ్చింది. అవార్డులు రాకపోవడమే జవాబు’ అని నెటిజన్లు అంటున్నారు. ఏస్వీరంగారావుగారి అవార్డును తక్కువ చేసి మాట్లాడటం లేదు. కేటగిరీల స్థాయి గురించి మాట్లాడను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రకాశ్‌రాజ్‌కు ఆప్లై చేశాను. బన్నీ ఆ కేటగిరీకి కరెక్ట్ కాదు. ఆప్లికేషన్ ప్రింట్లో ఈ అవార్డులపై మీడియా ముఖంగా అభ్యంతరం చెప్పినవారు మూడేళ్లు అవార్డులకు అర్హులు కారని నియమనిబంధనలతో కూడిన ఒక బుక్ ఉంది. అంతకు ముందు లేదు. ఇప్పుడే పెట్టారు. ఇలా అవార్డులు ఇవ్వడానికే ఆ నిబంధన పెట్టారనిపిస్తోంది. నంది అవార్డులు నాకు వ్యక్తిగతంగా ఎనిమిది వచ్చాయి. నేను తీసిన 12 సినిమాల సాంకేతిక నిపుణులకు, ఆర్టిస్టు లకు దాదాపు 30 నంది అవార్డులు వచ్చాయి. ‘ఒక్కడు’ సినిమాకి 8 అవార్డులు వచ్చినప్పుడు నన్ను విమర్శించారు.అవార్డుల ఎంపికలో మంచి ప్రమాణాలను పాటించాలని కోరుతున్నాను. అనుకూలంగా ఉన్నవారికే అవార్డులు– నిర్మాత మల్కాపురం శివకుమార్ నంది అవార్డులు పచ్చపార్టీ తమ కార్యకర్తలకు కండువాలను కప్పినట్లుగా ఉంది. అవార్డుకు అర్హత ఉన్న చిత్రాలను విస్మరించి తమకు అనుకూలంగా ఉన్నవారికే ప్రకటించింది. 2015లో సరికొత్త కాన్సెప్ట్‌తో నేను నిర్మించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇలాంటి కాన్సెప్ట్‌తో హాలీవుడ్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. హాలీవుడ్ వాళ్లకు ఇన్స్పిరేషన్గా నిలిచిన తెలుగు సినిమా నంది అవార్డు కమిటీకి కనిపించలేదా? ఈ అవార్డులు ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరపున ఇస్తే బాగుండేది. -
నంది అవార్డులు... విమర్శలు–వివాదాలు!
వడ్డించేవాడు మనవాడయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదని తెలుగులో ఓ సామెత! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితా విషయంలో కొందరు ఈ సామెతనే గుర్తు చేసుకుంటున్నారు. ‘అవార్డులు ఇచ్చేవాడు మనవాడయితే ఎలాంటి సినిమా తీసినా పర్వాలేదేమో!’ అంటున్నారు కొందరు నెటిజన్లు. సోమవారం ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు బాహాటంగానే విమర్శించారు. ‘రుద్రమదేవి’ తీసినందుకు క్షమించండి: గుణశేఖర్ ‘మా సిన్మాకి పన్ను మినహాయింపు ఎందుకివ్వలేదని ప్రశ్నించడమే నేను చేసిన తప్పా?’ అనడుగుతున్నారు ‘రుద్రమదేవి’ దర్శక–నిర్మాత గుణశేఖర్. ‘‘మహిళా సాధికారతను చాటి చెబుతూ తీసిన ‘రుద్రమదేవి’ మూడు ఉత్తమ చిత్రాల్లో ఏదో ఒకదానికి ఎందుకు ఎంపిక కాలేకపోయింది? కనీసం జ్యూరీ గుర్తింపుకి కూడా నోచుకోలేకపోయింది. మరచి పోయిన తెలుగు జాతి చరిత్రని వీడెవడో వెతికి, సినిమా తీసి గుర్తు చేశాడు. మళ్లీ ఇప్పుడు అవార్డులు ఇచ్చి గుర్తు చేయడం ఎందుకు అనుకున్నారా? ఇలాంటి చిత్రాన్ని ప్రోత్సహిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని భావించారా? అదే అయితే... ‘రుద్రమదేవి’ లాంటి చిత్రాన్ని నిర్మించినందుకు నన్ను క్షమించండి’’ అని గుణశేఖర్ పేర్కొన్నారు. మెగా హీరోలందరూ నటన నేర్చుకోవాలి: ‘బన్నీ’ వాసు మెగా ఫ్యామిలీ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్‌లో పలు చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించిన ‘బన్నీ’ వాసు నంది అవార్డులు ప్రకటన వచ్చిన తర్వాత ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు సాధించడానికి, మెగా హీరోలందరూ టీడీపీ ప్రభుత్వం దగ్గర నటనలో మెళకువలు నేర్చుకోవాలి’ అని ఫేస్బుక్లో కామెంట్ చేశారు. అనంతరం ‘‘ఏదో సినిమాకు అవార్డు వచ్చిందనో? మాకు రాలేదనో? కామెంట్ చేయలేదు. 2014లో ‘రేసుగుర్రం’ ఎంత ప్రజాదరణ పొందిందో... అందరికీ తెలిసిందే. ఉత్తమ చిత్రంతో పాటు చాలా కేటగిరీలు ఉన్నాయి. ‘రేసుగుర్రం’ను దేనికీ కన్సిడర్ చేయకపోవడంతో అప్సెట్ అయ్యా. 2012లో ‘గబ్బర్‌సింగ్’ విషయంలోనూ ఇలాంటి అన్యాయమే చేశారు. ఒకవేళ... ఈ రెండూ కమర్షియల్ సినిమాలని పక్కన పెడితే, ఇప్పుడు అవార్డులకు ఎంపిక చేసినవాటిలో 75 శాతం కమర్షియల్ సినిమాలే ఉన్నాయి కదా? వాటికి ఏ ప్రాతిపదికన ఇచ్చారు? మా రెండు సినిమాలను ఎందుకు పక్కన పెట్టారు? తెలియడం లేదు’’ అని ‘బన్నీ’ వాసు పేర్కొన్నారు. మారుతి కామెడీ దర్శకుడు మారుతి మంగళవారం ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో నటుడు ఉత్తేజ్ ‘ఉత్తమ అత్త, మేనత్త, అమ్మ, అక్క, చెల్లి, అత్యుత్తమ చెల్లి’ అవార్డులను ప్రకటిస్తుంటారు. ఉత్తమ సవతుల్లో అయితే వన్, టు, త్రీ అవార్డులు ఉంటాయి. ఇదంతా చూస్తున్న వ్యక్తి (నటుడు– రచయిత హర్షవర్ధన్) ‘ఒరేయ్! ఈ అవార్డ్స్ మన కోసం ఎరేంజ్ చేసినవేనా!’ అనడిగితే? పక్కన ఉన్న వ్యక్తి (నటుడు గుండు హనుమంతురావు) ‘ఇండస్ట్రీలో బాలాజీకి ఉన్న పరిచయస్తులకు ఏర్పాటు చేసినవి’ అంటాడు. ఈ వీడియో ఓ సీరియల్‌కి సంబంధించినది. నంది అవార్డులను ఉద్దేశించే సెటైరికల్‌గా మారుతి పోస్ట్ చేశారని పలువురి నెటిజన్ల ఫీలింగ్! లెజెండ్‌కు ఎక్కువ అవార్డులు రావడం ఆనందాన్నిచ్చింది : బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాకు ఎక్కువ అవార్డులు రావడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. బుధవారం అమరావతి అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014, 2015, 2016 సంవత్సరాలకు అవార్డులు గెలుచుకున్నవారికి అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి అవార్డుల ఎంపికకు మంచి స్పందన వచ్చిందన్నారు. -
పౌరాణిక పాత్రలో ఎన్టీఆర్..?
తెలుగు తెర మీద పౌరణిక పాత్రలతో అలరించిన మహానటుడు సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా రాముడిగానే కాదు. నెగెటివ్ రోల్స్ అయిన రావణాబ్రహ్మ, దుర్యోధనుడి పాత్రల్లోనూ ఎన్టీఆర్ నటన అద్భుతం. అందుకే ఆ తరువాత అలాంటి ప్రాతలు చేయడానికి ఎవరూ సాహసించలేదు. అయితే ఆయన వారుసుడిగా పరిచయం అయిన నందమూరి బాలకృష్ణ కృష్ణుడిగా, రాముడిగా అర్జునుడిగా నటించి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి అదే వంశం నుంచి ఓ పౌరాణిక చిత్రం తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. నందమూరి యువ నటుడు ఎన్టీఆర్ హీరోగా ఓ పౌరాణిక గాథకు దృశ్యరూపం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. ఇటీవల రుద్రమదేవితో చారిత్రక గాథను తెరకెక్కించి గుణ టీం ఇప్పుడు హిరణ్యకశ్యప పేరుతో సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ రోల్లో హిరణ్యకశ్యపుడిగా ఎన్టీఆర్‌ను నటింప చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే యమదొంగ సినిమాలో యముడి గెటప్‌లో ఆకట్టుకున్న ఎన్టీఆర్, పూర్తి స్థాయి పౌరాణిక పాత్ర చేయాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. మరి గుణశేఖర్ ఇచ్చిన ఆఫర్ కు జూనియర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
కేసీఆర్ ఇచ్చారు.. బాబుగారూ ఇవ్వండి
-
కేసీఆర్ ఇచ్చారు.. బాబుగారూ ఇవ్వండి: గుణశేఖర్
తాను దర్శకత్వం వహించి.. తెరకెక్కించిన చారిత్రక సినిమా ‘రుద్రమదేవి’కు వినోదపన్ను రాయితీ విషయమై తాజాగా ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. తాజాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు వినోదపన్ను రాయితీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పిన గుణశేఖర్.. తన ‘రుద్రమదేవి’ సినిమాకు కూడా వినోదపన్ను రాయితీ ఇస్తామని ఏపీ ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చిందని, దీనిపై కొంత పురోగతి చూపి.. ఆ తర్వాత ఈ ఫైలును అర్ధంతరంగా మూసివేశారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కాకతీయ మహాసామ్రాజ్ఞిని ‘రాణి రుద్రమదేవి’ సినిమాకు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు వినోదపన్ను రాయితీని ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాణిరుద్రమ దేవి కేవలం తెలంగాణకే పరిమితమైన నాయకురాలు కాదని, ఆమె దక్షిణపథమంతటినీ పాలించిన మహారాణి అని గతంలో చంద్రబాబు కూడా పేర్కొన్నారని గుర్తుచేసిన గుణశేఖర్.. ఎన్నో వ్యయప్రయాలకోర్చి 13వ శతాబ్దంలో స్త్రీ సాధికారితను ప్రపంచానికి చాటిచెప్పిన రుద్రమదేవి సినిమాను భారతదేశంలోనే మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ సినిమాగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందించానని, కాబట్టి ఏపీలో ఈ సినిమాకు వినోద పన్ను కింద వసూలు చేసిన మొత్తాన్ని ‘ప్రోత్సాహక నగదు’ కింద అందించాలని గుణశేఖర్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. -
బుడ్డోడే 'వీరాభిమన్యు'..?
రుద్రమదేవి సినిమాతో మంచి జోష్‌లో ఉన్న దర్శకుడు గుణశేఖర్ ఈ సారి ఓ పౌరాణిక చిత్రానికి రెడీ అవుతున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రుద్రమదేవి మంచి విజయం సాధించటంతో మరింత ప్రతిష్టాత్మకంగా పౌరాణిక పాత్ర వీరాభిమన్యుడిని వెండితెర మీద ఆవిష్కరించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే వీరాభిమన్యు అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేసిన గుణశేఖర్ త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నాడు. అయితే ఈ సినిమాలో అభిమన్యుడి పాత్రలో నటించే నటుడు ఎవరంటూ టాలీవుడ్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డిగా అదరగొట్టిన అల్లు అర్జున్ అభిమన్యుడిగా నటించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపించింది. అయితే పౌరాణిక పాత్రలో నటించిన అనుభవం ఉన్న నటుడైతే బాగుంటుందని భావించిన గుణశేఖర్ జూనియర్ ఎన్టీఆర్‌ను వీరాభిమన్యుడిగా చూపించాలని భావిస్తున్నాడట. రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి పాత్రకు కూడా ముందుగా ఎన్టీఆర్‌నే సంప్రదించాడు గుణశేఖర్. అప్పట్లో ఆ కాంబినేషన్ కుదరకపోవటంతో మరోసారి అదే ప్రయత్నాలో ఉన్నాడట. ఎన్టీఆర్ కుటుంబ నేపధ్యం కూడా ఈ తరహా సినిమాలకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన చేయకపోయినా ఈ వార్తలతో నందమూరి అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. -
'రుద్రమదేవి' తరువాత 'వీరాభిమన్యు'
రుద్రమదేవి సినిమాతో భారీ రిస్క్ చేసిన దర్శకుడు గుణశేఖర్, అదే స్థాయిలో మంచి విజయాన్ని సాధించాడు. ఎన్నో కష్టనష్టాలను దాటి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు వసూళ్ల పరంగాను మంచి రికార్డులనే నమోదు చేశాడు. ఇప్పుడు ఇదే జోష్ లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈసినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. రుద్రమదేవి సినిమా సమయంలోనే ఆ సినిమాకు సీక్వల్ తీసే ఆలోచన ఉందంటూ ప్రకటించాడు గుణశేఖర్. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆఖరి రాజు ప్రతాపరుద్రుడి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించాలని భావించాడు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని విమరమించుకొని మరో ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. చారిత్రక చిత్రంతో ఘనవిజయం సాధించిన గుణా టీం ఈ సారి పౌరాణిక గాథ మీద దృష్టిపెట్టింది. వీరాభిమన్యు పేరుతో మహాభారతంలోనే ఓ ఘట్టాన్ని సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట గుణశేఖర్. ఇప్పటికే అందుకు సంబందించి వీరాభిమన్యు అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. ఇదే పేరుతో శోభన్ బాబు కథనాయకుడిగా 1965లో ఓ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ప్రస్థుతం సాంకేతిక ఎన్నో మార్పులు వచ్చాయి కాబట్టి భారీగా ఈసినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. మరి ఈ పౌరాణిక కథతో వీరాభిమన్యుడిగా ఎవరు నటిస్తారో చూడాలి. -
'రుద్రమదేవి'కి ప్రముఖుల అభినందనలు
రుద్రమదేవి సినిమాకు ప్రముఖుల నుంచి సపోర్ట్ అందుతోంది. గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం భారీగా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనుష్కతో బాహుబలి సినిమాలో కలిసి నటిస్తున్న ప్రభాస్, గుణశేఖర్ తో పాటు రుద్రమదేవి టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సినిమాలో గోనగన్నారెడ్డిగా కీలక పాత్రలోనటించిన అల్లు అర్జున్ రుద్రమదేవి రిలీజ్‌పై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమాకు వినోదపన్ను మినహాయింపు ఇచ్చినందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. బాహుబలి లాంటి భారీ సినిమాను అందించిన దర్శకధీరుడు రాజమౌళి కూడా రుద్రమదేవి టీంను అభినందించాడు. ఎన్నో కష్టనష్టాలకోర్చి రుద్రమదేవి సినిమాను రిలీజ్ చేసిన గుణశేఖర్ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణతో పాటు ఆంద్రప్రదేశ్‌లోనూ ఈ సినిమాకు వినోదపన్ను రాయితీ కల్పించాలని కోరారు. Gunasekhar's #Rudhramadevi releases tomorrow. Best wishes to the entire team!!! pic.twitter.com/cEzO533jdM — Baahubali (@BaahubaliMovie) October 8, 2015 I Thank the Hon.CM of Telangana State KCR garu for being Generous by exempting the Entertainment Tax for Rudramadevi Movie — Allu Arjun (@alluarjun) October 8, 2015 #Rudhramadevi Released ! After all the hardships the project went through I am personally happy the movie is Out ! — Allu Arjun (@alluarjun) October 9, 2015 Just heard that #Rudhramadevi has been made tax free in Telangana. Fantastic news for Gunasekhar garu who has been swimming against the — rajamouli ss (@ssrajamouli) October 8, 2015 current for such a long time to bring this epic to film. Rudramadevi is a queen for all Telugu land.I think even the govt of AP should and — rajamouli ss (@ssrajamouli) October 8, 2015 will exempt this film from tax. All the best to everyone involved in Rudramadevi.. — rajamouli ss (@ssrajamouli) October 8, 2015 -
'రుద్రమదేవి' మూవీ రివ్యూ
టైటిల్ : రుద్రమదేవి జానర్ ; హిస్టారికల్ యాక్షన్ డ్రామా తారాగణం ; అనుష్క, అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు దర్శకత్వం ; గుణశేఖర్ సంగీతం ; ఇళయరాజా నిర్మాత ; గుణశేఖర్ ఎన్నో అవాంతరాల తరువాత దర్శకుడు గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ రుద్రమదేవి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రుద్రమదేవి. దర్శకుడు గుణశేఖర్ 12 ఏళ్ల పాటు రిసెర్చ్ చేసి రూపొందించిన కథతో రూ. 80 కోట్లకు పైగా బడ్జెట్ తో తొలి భారతీయ స్టీరియో స్కోపిక్ త్రీడి చిత్రంగా తెరకెక్కిన రుద్రమదేవి ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ ; చరిత్ర పరంగా రుద్రమదేవి కథలో ఎన్నో ఊహాగానాలు, కల్పిత కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ అపోహలన్నింటికీ రుద్రమదేవి సినిమాతో సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు గుణశేఖర్. 13 శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు గణపతిదేవుడు( కృష్ణంరాజు). ఆయనకు కుమార్తె మాత్రమే ఏకైక సంతానం కావటంతో, తన తరువాత సింహాసనాన్ని అధీష్టించడానికి వారసులు లేరన్న భావనతో కుమార్తె రుద్రమదేవినే... కుమారుడు రుద్రదేవగా కాకతీయ ప్రజలకు పరిచయం చేస్తాడు. అందుకు తగ్గట్టుగానే మహామంత్రి శివదేవయ్య( ప్రకాష్‌రాజ్) రుద్రమదేవికి అన్ని విద్యలలోనూ శిక్షణ ఇస్తాడు. గణపతిదేవుని మరణం తరువాత కొంత కాలనికి కాకతీయ సామ్రాజ్యపు వారసుడు రాజు కాదు రాణి, రుద్రదేవ కాదు, రుద్రమదేవి (అనుష్క) అని ప్రకటిస్తాడు మంత్రి శివదేవయ్య. ఈ విషయాన్ని సామంతులు జీర్ణించుకోలేకపోతారు. ఓ మహిళ దగ్గర సామంతులుగా ఉండటానికి అంగీకరించరు. దీంతో రుద్రమదేవి రాజ్యం విడిచి వెళ్లాల్సి వస్తుంది. అదే సమయంలో మహదేవ ( విక్రమ్‌జిత్) కాకతీయ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని కుట్రలు పన్నుతాడు. పాలన సరిగా లేకపోవటంతో ప్రజా హక్కుల కోసం పోరాడే గోన గన్నారెడ్డి (అల్లుఅర్జున్) కాకతీయ సామ్రాజ్యంపై ఎదురుతిరుగుతాడు. రాజ్యంలో అనిశ్చితి నెలకొనటంతో ఎలాగైన రాజ్య పరిస్థితి చక్కదిద్దాలని, తిరిగి సింహాసనాన్ని అధిష్టించాలని రుద్రమదేవి ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. అందుకు సాయం చేయాల్సిందిగా తనకు అత్యంత సన్నిహితుడైన నిడదవోలు రాజు చాళుక్య వీరభద్రుడి(రానా) సాయం కోరుతుంది. రాజ్య పరిస్థితి చూసిన గోన గన్నారెడ్డి కూడా వీరికి సాయం చేయడానికి అంగీకరిస్తాడు. ఈ ఇద్దరి సాయంతో రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది.? ఆ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నది అన్నదే సినిమా కథ. విశ్లేషణ : మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో కాకతీయ సామ్రాజ్యపు గొప్పతనాన్ని వివరిస్తూ సినిమా ప్రారంభమవుతుంది. సినిమాలో ప్రతీ పాత్రను అద్భుతంగా ప్రజెంట్ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా రుద్రదేవగా, రుద్రమదేవిగా రెండు షేడ్స్ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ఇక అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ నుంచి గెటప్, డైలాగ్స్ ఇలా అన్నింటిలోనూ చాలా కేర్ తీసుకున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమాకు మెయిన్ ఎసెట్ గా భావిస్తున్న గోన గన్నారెడ్డి పాత్రను ఆశించిన స్ధాయిలో ప్రజెంట్ చేశారు. రుద్రమకు సాయం చేసే పాత్రలో చాళుక్య వీరభద్రుడిగా రానా మరోసారి మెప్పించాడు. భళ్ళాలదేవ తరువాత మరో చారిత్రక పాత్రలో కనిపించిన రానా ... తాను ఎలాంటి పాత్రనైన పోషించగలనని మరోసారి ప్రూవ్ చేశాడు. అయితే చాలా పెద్ద కథ కావటంతో అన్ని పాత్రలకు సరైన క్లారిటీ ఇవ్వటంతో మాత్రం దర్శకుడు విఫలమైనట్టుగా అనిపిస్తుంది. ఆడియో పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది రుద్రమదేవి, కథలో ఎక్కడ పాటలకు అవకాశం లేకపోయినా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అన్నట్టుగా పాటలు రావటం స్టోరి నారేషన్కు కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ఇంటర్వెల్ వరకు కథ మీద మంచి పట్టు చూపించిన దర్శకుడు తరువాత మాత్రం అనుకున్న స్థాయిలో నడిపించలేకపోయాడు. చాలా సన్నివేశాలు లెంగ్తీగా అనిపిస్తాయి. నటీనటులు : రుద్రమదేవిగా చారిత్రక పాత్రలో అనుష్క చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా రుద్రదేవ, రుద్రమదేవిగా రెండు షేడ్స్‌ను ఆమె తన నటనతో మెప్పించింది. ఇక పోరాట సన్నివేశాల్లో యాక్షన్ స్టార్స్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా అలరించింది. అనుష్క లుక్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు. బాడీ లాంగ్వేజ్‌తో పాటు దుస్తులు, నగలు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడు. గంభీరమైన లుక్ తో, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో అలరించాడు. మాస్లో మంచి ఫాలోయింగ్ ఉన్న బన్నీకి ఈ క్యారెక్టర్ మంచి ప్లస్ అవుతుందనే చెప్పాలి. రానా పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో బాగానే మెప్పించాడు. సినిమా అంత రుద్రమకు సపోర్ట్ చేసే పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక కృష్ణంరాజు, ప్రకాష్రాజులు తమ పరిథి మేరకు అలరించారు. విలన్‌గా విక్రమ్‌జిత్ పరవాలేదనిపించాడు. సాంకేతిక నిపుణులు : ఓ భారీ చారిత్రక కథాంశాన్ని వెండితెర మీద చూపించాలన్న గుణశేఖర్ కల నెరవేరిందనే చెప్పాలి. సెట్, గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించిన రుద్రమదేవి ప్రేక్షకులను 13వ శతాబ్దంలోకి తీసుకెళుతుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు మ్యాస్ట్రో ఇళయరాజా. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే చాలా సన్నివేశాలు లెంగ్తీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం టెక్నికల్ టీమ్ పడిన కష్టం ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తుంది. తోట తరణి ఆర్ట్ వర్క్, జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫి అద్భుతంగా వచ్చాయి. నీతాలుల్లా కాస్ట్యూమ్స్ కాకతీయ సామ్రాజ్యపు పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాయి. రుద్రమదేవి సినిమా విషయంలో దర్శకుడి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. దాదాపు 12 ఏళ్ల పాటు శ్రమించి తయారు చేసుకున్న కథతో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ సినిమాను తెరకెక్కించాడు గుణశేఖర్. అయితే అందరికి తెలిసిన కథను మరింత ఇంట్రస్టింగ్‌గా చెప్పడంలో కాస్త తడబడ్డాడు. అయితే క్లైమాక్స్‌లో వచ్చే వార్ ఎపిసోడ్స్‌తో అన్ని మరచిపోయేలా చేయగలిగాడు గుణ. యుద్ధ సన్నివేశాలు ఇంకాసేపు ఉంటే బాగుండనిపించింది. ప్లస్ పాయింట్స్ : అనుష్క, అల్లు అర్జున్ నటన విజువల్ ఎఫెక్ట్స్ సెట్టింగ్స్ స్టోరీ మైనస్ పాయింట్స్ : లెంగ్తీ సీన్స్ ఎడిటింగ్ పాటలు ఓవరాల్‌గా రుద్రమదేవి కాకతీయ చరిత్రను నేటి తరానికి పరిచయం చేసే మంచి ప్రయత్నం. -
'రుద్రమదేవి'కి పన్ను మినహాయింపు
-
'రుద్రమదేవి'కి పన్ను మినహాయింపు
ఎన్నో వాయిదాల తరువాత అక్టోబర్ 9న రిలీజ్‌కు రెడీ అవుతన్న ప్రతిష్టాత్మక చిత్రం 'రుద్రమదేవి'కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సాయం అందుతోంది. ఓరుగల్లు వీరనారి రుద్రమదేవి కథగా తెరకెక్కిన ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. చిత్ర దర్శకనిర్మాత గుణశేఖర్ తో పాటు, నిర్మాత దిల్ రాజు గురువారం కేసీఆర్ ను కలిసిన నేపథ్యంలో ఈ మేరకు హామి ఇచ్చారు. గుణశేఖర్, రుద్రమదేవి సినిమా చూడాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించారు. కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందిస్తూ తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు. రుద్రమదేవిగా అనుష్క నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. తన సొంత నిర్మాణ సంస్థ గుణ టీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. -
తమిళంలో 16న రుద్రమదేవి రిలీజ్..?
గుణశేఖర్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించటం లేదు. పెద్ద సినిమాలు పోటిలో ఉన్నా బరిలో దిగేందుకు సిద్దమంటూ రిలీజ్‌కు రెడీ అవుతున్న రుద్రమదేవికి టాలీవుడ్లో లైన్ క్లియర్ అయినా కోలీవుడ్‌లో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సినిమా తమిళ వర్షన్ ను ఒక వారం ఆలస్యంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట కోలీవుడ్ నిర్మాతలు. పులి సినిమా టాక్ పరంగా ఆకట్టుకోలేకపోయినా, కలెక్షన్ల పరంగా మాత్రం మంచి ఫాంలో ఉంది. దీంతో వెంటనే రుద్రమదేవి రిలీజ్ అయితే రెండు సినిమాల వసూళ్ల మీద ప్రభావం పడుతుందన్న ఆలోచనతో ఈ సినిమా రిలీజ్ ను ఒక వారం వాయిదా వేయాలని భావిస్తున్నారట. పులి సినిమాను తమిళనాట రిలీజ్ చేసిన తెనండల్ ఫిలింస్ రుద్రమదేవి సినిమాను కూడా రిలీజ్ చేస్తోంది. దీంతో అక్టోబర్ 16న రుద్రమదేవి తమిళ వర్షన్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ హిస్టారికల్ త్రీడి స్టీరియో స్కోపిక్ సినిమా అక్టోబర్ 9న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే తమిళ వర్షన్‌ను కూడా అదే రోజు రిలీజ్ చేయాలని భావించినా ఆ అవకాశం కనిపించటం లేదు. -
'చరిత్రను వక్రీకరించలేదు.. గ్రాఫిక్స్‌ను నమ్ముకోలేదు'
హైదరాబాద్: రుద్రమదేవి సినిమాలో తాను ఎవరి చరిత్రను వక్రీకరించలేదని దర్శకుడు గుణ శేఖర్ అన్నారు. కేవలం గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ నమ్ముకుని చేసుకొని సినిమా తీయలేదని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా రుద్రమదేవి సినిమా అక్టోబర్ 9న విడుదలవుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. సినిమా మూడుసార్లు సెన్సార్‌కు వెళ్లిందనే వార్తలు పూర్తిగా అబద్ధం అని చెప్పారు. కేవలం ఒకసారి మాత్రమే రుద్రమదేవి సినిమా సెన్సార్ అయిందని చెప్పారు. ఇప్పటి వరకు పలుమార్లు రుద్రమదేవి చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు భాషల్లో రుద్రమదేవి విడుదలవుతుంది. తెలుగు, తమిళం, హిందీతోపాటు కన్నడ భాషల్లో కూడా రుద్రమదేవి విడుదల కానుంది. -
సెప్టెంబర్ 4న 'రుద్రమదేవి' విడుదల
హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రుద్రమదేవి' సినిమాను సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్టు దర్శకుడు గుణశేఖర్ ప్రకటించారు. ఆయన శుక్రవారం తన కుటుంబ సభ్యులు, హీరోయిన్ అనుష్కతో కలిసి ఆ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పారు. హిందీలో ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలో చెబుతామన్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందన్నారు. 3డీ సీజీ టెక్నాలజీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. అజయ్ విన్సెంట్ కెమెరా పనితనం, ఇళయరాజా రీరికార్డింగ్ సినిమాకు ప్లస్ అవుతాయని అభిప్రాయపడ్డారు. కథను ఇళయరాజా అద్భుతంగా ఎలివేట్ చేశారన్నారు. గోనా గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ ఒదిగి పోయారని, సినిమాలో ఈ పాత్ర గంటసేపు ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా 'రుద్రమదేవి' ఆండ్రాయిడ్ యాప్ విడుదల చేశారు. -
రామప్పలో... రుద్రమదేవి
వరంగల్: రామప్ప దేవాలయంలో శనివారం ఉదయం నుంచి రుద్రమదేవి చిత్ర కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అనుష్క, రానా, కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, సుమన్, జయప్రకాశ్ రెడ్డిలతో పాటు అల్లు అర్జున్, నిత్యామీనన్‌లు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 'ఒక్కడు'లాంటి బ్లాక్ బస్టర్ చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ అంతటి స్థాయి ఘనవిజయాన్ని సొంతం చేసుకోలేదు. టాలీవుడ్లో క్రియేటివ్ డెరైక్టర్‌గా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ 'రుద్రమదేవి' చిత్రంతో మళ్లీ పూర్వ వైభం కోసం ప్రయత్నిస్తున్నాడు. దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా గుణశేఖర్ ఈ సినిమాకు వ్యవహరించడం విశేషం. దాదాపు రూ.85 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.