సెప్టెంబర్ 4న 'రుద్రమదేవి' విడుదల | rudramadevi movie released on september on 4 | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 4న 'రుద్రమదేవి' విడుదల

Published Fri, Jul 24 2015 12:50 PM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

సెప్టెంబర్ 4న 'రుద్రమదేవి' విడుదల

సెప్టెంబర్ 4న 'రుద్రమదేవి' విడుదల

హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రుద్రమదేవి' సినిమాను సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్టు దర్శకుడు గుణశేఖర్ ప్రకటించారు.   ఆయన శుక్రవారం తన కుటుంబ సభ్యులు, హీరోయిన్ అనుష్కతో కలిసి ఆ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పారు. హిందీలో ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలో చెబుతామన్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందన్నారు. 3డీ సీజీ టెక్నాలజీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు.

అజయ్ విన్సెంట్ కెమెరా పనితనం, ఇళయరాజా రీరికార్డింగ్ సినిమాకు ప్లస్ అవుతాయని అభిప్రాయపడ్డారు. కథను ఇళయరాజా అద్భుతంగా ఎలివేట్ చేశారన్నారు. గోనా గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ ఒదిగి పోయారని, సినిమాలో ఈ పాత్ర గంటసేపు ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా 'రుద్రమదేవి' ఆండ్రాయిడ్ యాప్ విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement