‘‘రాజమౌళి ‘బాహుబలి’ని పాన్ ఇండియాకి, ‘ఆర్‌ఆర్‌ఆర్’ని మొత్తం ప్రపంచానికి చూపించారు. మన తెలుగు సినిమాలు ప్రపంచానికి చూపిస్తూనే ఉండాలి.. దాని కోసం నా మొదటి అడుగు ‘శాకుంతలం’. ఇది మన ఇండియన్ సినిమా అని తర్వాతి తరానికి తెలియాలి. ఈ మూవీ ప్రేక్షకులను నిరుత్సాహపరచదు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సమంత లీడ్ రోల్‌లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకుంతలం’. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. మంగళవారం ఈ చిత్రం త్రీడీ ట్రైలర్‌ని విడుదల చేశారు.
చదవండి: అమెరికాలో లయ శాలరీ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ..‘‘గుణశేఖర్‌గారికి సాయం చేయడానికి నేను ఈ మూవీలో భాగమయ్యాను’ అని అందరూ అనుకుంటారు. కానీ, గుణశేఖర్‌గారు మోస΄ోయారు.. నేను స్వార్థంతో ఈ మూవీలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే తెలుగు సినిమా గ్లోబల్ వరకూ వెళ్లింది. భవిష్యత్‌లో నేను కూడా ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న గొప్ప సినిమాలు తీయాలంటే పని నేర్చుకోవాలి. అందుకే ‘శాకుంతలం’లో చేరాను’’ అన్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘‘ఇది సమంతగారి ‘శాకుంతలం’. శకుంతల పాత్రకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు’’ అన్నారు. ‘‘మైథాలజీలో త్రీడీలో వస్తున్న తొలి చిత్రం ‘శాకుంతలం’. ప్రేక్షకులందరూ ఈ మూవీని త్రీడీలో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు నీలిమ గుణ.
చదవండి: బర్త్‌డే రోజున చరణ్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment