'చరిత్రను వక్రీకరించలేదు.. గ్రాఫిక్స్ను నమ్ముకోలేదు' | i dint belive in graphics to make rudramadevi: gunashekar | Sakshi
Sakshi News home page

'చరిత్రను వక్రీకరించలేదు.. గ్రాఫిక్స్ను నమ్ముకోలేదు'

Published Sun, Oct 4 2015 6:07 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 AM

'చరిత్రను వక్రీకరించలేదు.. గ్రాఫిక్స్ను నమ్ముకోలేదు'

'చరిత్రను వక్రీకరించలేదు.. గ్రాఫిక్స్ను నమ్ముకోలేదు'

హైదరాబాద్: రుద్రమదేవి సినిమాలో తాను ఎవరి చరిత్రను వక్రీకరించలేదని దర్శకుడు గుణ శేఖర్ అన్నారు. కేవలం గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ నమ్ముకుని చేసుకొని సినిమా తీయలేదని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా రుద్రమదేవి సినిమా అక్టోబర్ 9న విడుదలవుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. సినిమా మూడుసార్లు సెన్సార్కు వెళ్లిందనే వార్తలు పూర్తిగా అబద్ధం అని చెప్పారు.

కేవలం ఒకసారి మాత్రమే రుద్రమదేవి సినిమా సెన్సార్ అయిందని చెప్పారు. ఇప్పటి వరకు పలుమార్లు రుద్రమదేవి చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు భాషల్లో రుద్రమదేవి విడుదలవుతుంది. తెలుగు, తమిళం, హిందీతోపాటు కన్నడ భాషల్లో కూడా రుద్రమదేవి విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement