'రుద్రమదేవి' తరువాత 'వీరాభిమన్యు' | gunashekar planing to direct mythological film veerabhimanyu | Sakshi
Sakshi News home page

'రుద్రమదేవి' తరువాత 'వీరాభిమన్యు'

Published Sun, Nov 1 2015 8:34 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

'రుద్రమదేవి' తరువాత 'వీరాభిమన్యు'

'రుద్రమదేవి' తరువాత 'వీరాభిమన్యు'

రుద్రమదేవి సినిమాతో భారీ రిస్క్ చేసిన దర్శకుడు గుణశేఖర్, అదే స్థాయిలో మంచి విజయాన్ని సాధించాడు. ఎన్నో కష్టనష్టాలను దాటి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు వసూళ్ల పరంగాను మంచి రికార్డులనే నమోదు చేశాడు. ఇప్పుడు ఇదే జోష్ లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈసినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

రుద్రమదేవి సినిమా సమయంలోనే ఆ సినిమాకు సీక్వల్ తీసే ఆలోచన ఉందంటూ ప్రకటించాడు గుణశేఖర్. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆఖరి రాజు ప్రతాపరుద్రుడి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించాలని భావించాడు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని విమరమించుకొని మరో ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. చారిత్రక చిత్రంతో ఘనవిజయం సాధించిన గుణా టీం ఈ సారి పౌరాణిక గాథ మీద దృష్టిపెట్టింది.

వీరాభిమన్యు పేరుతో మహాభారతంలోనే ఓ ఘట్టాన్ని సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట గుణశేఖర్. ఇప్పటికే అందుకు సంబందించి వీరాభిమన్యు అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. ఇదే పేరుతో శోభన్ బాబు కథనాయకుడిగా 1965లో ఓ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ప్రస్థుతం సాంకేతిక ఎన్నో మార్పులు వచ్చాయి కాబట్టి భారీగా ఈసినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. మరి ఈ పౌరాణిక కథతో వీరాభిమన్యుడిగా ఎవరు నటిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement