mythological
-
ప్రవచన నిధి..మల్లాది
అది దాదాపు 1955–60 మధ్య కాలం .. గుంటూరులోని బ్రాడీపేట మైదానంలో పురాణ పఠనం జరుగుతోంది. దాదాపు పది వేల మంది కూర్చుని ఉన్నారు. అప్పట్లో మైకుల ఏర్పాటు అన్నిచోట్లా కుదిరేది కాదు. అయినా ఆ మైదానంలో చేరిన చివరి వ్యక్తికి సైతం ఒక కంఠం స్పష్టంగా విన్పిస్తోంది. శ్రావ్యంగా, మరింత వినాలనిపించే రీతిలో సాగుతున్న పురాణ పఠనం వారిని కట్టిపడేసింది. కొన్ని గంటల పాటు ఆ ప్రాంతమంతా ఒక శ్రోతగా మారిపోయింది. అదే గుంటూరు ప్రాంతం. మహాభారత ప్రవచనం రెండేళ్లపాటు సాగింది. ఎన్నో గాథలు.. మరెన్నో కొత్త విషయాలు.. పిట్టకథలు.. సామాజిక కోణంలో కథనం.. ధర్మాచరణను నొక్కి చెప్పే నిగూఢ ప్రయత్నం.. సంప్రదాయాలు–విలువలు, నీతి నిజాయితీలు, ఆచరణీయాలు, నడవడిక, బతుకుకు అర్థం.. ఇలా ఒకటేమిటి, ధారాపాతంగా ఎన్నో విషయాలు.. ఆ రెండేళ్లూ ప్రతిరోజూ సాయంత్రం కాగానే ఆ మైదానానికేసి వేల మంది పయనం..అలాగే వరంగల్లో ఏడాది పాటు రామాయణ ప్రవచనం.. రాముడంటే ఓ పౌరాణిక పాత్ర కాదు, మనిషంటే ఇలా జీవించాలి అని శ్రోతలకు ఆలోచన పుట్టించే రీతిలో సాగిన పురాణం..ఆయన మాటే ఓ మంత్రం..ఆయనే మల్లాది చంద్రశేఖరశాస్త్రి. సాక్షి, హైదరాబాద్: ఇప్పటి తరానికి అంతగా పరిచయం లేకపోవచ్చు.. కానీ టీవీ చానళ్లలో నిత్యం వినిపించే ‘ప్రవచనాలకు’ మల్లాది చంద్రశేఖరశాస్త్రి ఆది. ఆయన 1925 ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో జన్మిం చారు. తల్లిదండ్రులు దక్షిణామూర్తి, అదిలక్ష్మ మ్మ ఆయనపై ఎక్కువగా ప్రభావం చూపినట్లు చెబుతారు. తన 15వ ఏట నుంచే చంద్రశేఖర శాస్త్రి ప్రవచన యజ్ఞాన్ని ప్రారంభించారు. అప్పటివరకు పురాణాలు చెప్పే తీరు వేరు.. మల్లాది వారు ప్రవచించటం ప్రారంభించిన తర్వాత అది మరో తీరు. రేడియోకు అతుక్కుపోయి పురాణ ప్రవచనం వినే వారి సంఖ్య అప్పట్లో లక్షల్లో ఉండేది. పురాణ కాలక్షేపం అన్న మాట చాలాకాలం విస్తృత వినియోగంలో ఉండేది. కానీ.. అది తప్పని, పురాణ ప్రవచనం అనాలి కానీ పురాణ కాలక్షేపం అనకూడదని, కాలక్షేపం అనడమంటే పురాణాలకున్నటువంటి ప్రాశస్త్యాన్ని తగ్గించినట్లేనని మల్లాది అనేవారు. పురాణం వినటం కాలక్షేపం కోసం కాదు, జీవన గమనాన్ని మార్చుకునేందుకన్న విషయాన్ని గుర్తించాలని చెప్పేవారు. పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాల సారాన్ని జీవితానికి అన్వయించుకోవాలని ఆయన బలంగా చెప్పేవారు. 96 ఏళ్ల పరిపూర్ణ జీవితాన్ని గడిపిన ఆయన చివరివరకు నిత్యం ఏదో ఓ గ్రంథాన్ని పఠిస్తూ ఉండేవారు. వేదం, తర్కం, వేదాంతం, మీమాంస, వ్యాకరణం, వేదాంత భాష్యంలో విశేష ప్రవేశం ఉన్న ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులుగా సామాజిక హితం కోసం విశేష కృషి చేశారు. తన తాతగారైన రామకృష్ణ విద్వన్ మహాఅహితాగ్ని వద్దే ప్రధాన విద్యనభ్యసించారు. ఉపన్యాసం, హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునేలా ప్రవచనం చేయడంలో మల్లాది సుప్రసిద్ధులు. సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించినట్టే.. టీవీలు విస్తృత ప్రాచుర్యంలోకి రాకముందు రేడియోల ద్వారానే ముఖ్య కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా జనం వినేవారు. వాటిల్లో ముఖ్యమైంది భద్రాద్రి రామకళ్యాణం. నాలు గైదు దశాబ్దాల క్రితం వరకు ఊరూరా రామనవమి వేడుకలు జరుగుతున్నా, భద్రాద్రి శ్రీ రామకల్యాణ వ్యాఖ్యానాన్ని రేడియోలో వినటానికి భక్తులు ప్రాధాన్యతనిచ్చేవారు. ఆ కణ్యాణ వ్యాఖ్యానంలో మల్లాదివారే కీలకం. చంద్రశేఖర శాస్త్రి కల్యాణ ఘట్టాన్ని కమనీయంగా వ్యాఖ్యానిస్తూంటే రేడియో సెట్ల ద్వారా దాన్ని వింటూ భక్తకోటి ప్రత్యక్షంగా తిలకిస్తున్న అనుభూతి పొందేవారు. ఆ తరహా వ్యాఖ్యానాన్ని ప్రారంభించింది ఆయనే. ఇక ప్రభుత్వ పక్షాన అధికారికంగా ఉగాది పంచాంగ పఠనానికి కూడా ఆయ నే ఆద్యుడు. రాష్ట్రమంతటా ప్రవచనాలు చెప్పటం ద్వారా అన్ని ప్రాంతాల్లో ఆయన అభిమానాన్ని చూరగొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏడాది రెండేళ్ల పాటు ప్రవచనాలు కొనసాగేవి. తెలుగు–సంస్కృతంలో ప్రవచనం చెప్పగలిగిన ఒకేఒక పౌరాణికులు ఆయన. దీంతో ఆయనకు ప్రవచన సవ్యసాచి అన్న బిరుదు వచ్చింది. ఇక అభినవ వ్యాసులు, పౌరాణిక సార్వభౌములు, మహామహోపాధ్యాయ, పురాణ వాచస్పతి లాంటి మరెన్నో బిరుదులున్నాయి. రాజలక్ష్మీ పురస్కారాన్ని అందుకున్నారు. మల్లాది మంచి మాటలు.. ‘మతమనేది మనం సృష్టించుకున్న మాటనే. ఆ పేరుతో భేద భావం కూడదు. ధర్మాచరణే ముఖ్యమైంది.. ’ సంతృప్తిని మించిన సంపద మరోటి లేదు. ధర్మంగా చేసే పనేదైనా, ఆదాయం ఎంతైనా సంతృప్తిగా ఉండాలి. పెద్ద సంపాదన ఉంటే అహంకారంతో ఉండటం సరికాదు. సదా దేవుడికి కృతజ్ఞతతో ఉండాలి’ ‘నా మాట వినేందుకు వచ్చేవారు పేదలా, ధనవంతులా, పండితులా, పామరులా అన్న ఆలోచన నాలో ఉండదు. చెప్పే విషయాల్లో లీనమై ప్రవచిస్తాను. ధర్మంతో కూడుకున్న మాటలే చెబుతాను. నేను మాత్రమే గొప్పగా చెప్తానన్న అహంకారం నాలో లేదు.’ -
సత్య సంధత..భక్తి పరాయణత
- అలరించిన పౌరాణిక నాటకాలు కర్నూలు (కల్చరల్): నందినాటకోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు భారతీయ ఇతిహాసాలలోని ఉన్నత విలువలను చాటి చెప్పాయి. వంశీ కళాక్షేత్రం తిరుపతి నాటక సమాజం ప్రదర్శించిన ‘రావణ బ్రహ్మ’, వేణుగోపాల స్వామి నాట్యమండలి వరంగల్ నాటక సమాజం వారు ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర, మైత్రీ కళాపరిషత్ మహబూబ్నగర్ నాటక సమాజం వారు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’ నాటకాలు, రామాయణ భారత గాథలలోని ఔన్యత్యాన్నికి ప్రతీకగా నిలిచాయి. ఆకట్టుకున్న ‘రావణబ్రహ్మ’ బ్రహ్మ వంశానికి చెందిన దశగ్రీవుడు అసురజాతిలో పుట్టి తపస్సు చేసి పరమేశ్వరున్ని మెప్పించి అఖండమైన వరుములు పొంది రావణబ్రహ్మగా గుర్తింపు పొందారు. అసురజాతిలో అత్యంత పరాక్రమవంతుడుగానే కాకుండా ఆధ్యాత్మిక సేవాతత్వం కలిగిన రాజుగా రావణబ్రహ్మ గణుతికెక్కాడు. నిత్యం శివలింగార్చన చేసి లంకను స్వాధీనం చేసుకొని అత్యంత అహంభావంతో మెలిగిన రావణుని చరితను ‘రావణబ్రహ్మ’ నాటకం కళ్లకు కట్టినట్లు చిత్రించింది. రాధాదేవి రచించిన ఈ నాటకంలో పల్లేటిలక్ష్మి కులశేఖర్ అత్యంత హృద్యమైన పద్యాలను రచించారు. జీఎల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆసక్తికరంగా ‘సత్యహరిశ్చంద్ర’ సూర్యవంశపు రాజైన హరిశ్చంద్రుడు క్రమశిక్షణాబద్ధమైన జీవన శైలికి ప్రతీకగా నిలిచాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, తన జీవిత కాలంలో ఎన్నడూ అబద్ధమాడి ఎరుగకపోవడం హరిశ్చంద్రుని ఉత్తమ గుణాలు. ఈ పాత్రలోని సత్యసంధతను హరిశ్చంద్ర నాటకం చక్కగా చాటి చెప్పింది. విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యహరిశ్చంద్రుడు కట్టుబట్టలతో అడవులకేగడం, కాటి కాపరిగా మారడం, కొడుకు శవాన్ని వల్లకాడులోకి అనుమతించడానికి సుంకం అడగడం నిష్టాగరిష్టమైన గుణాలను ఈ పాత్రలో దర్శకుడు చక్కగా చూపించాడు. వరంగల్ జిల్లా వేణుగోపాలస్వామి నాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన ఈ నాటకం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శ్రీనివాసాచారి దర్శకత్వం వహించిన ఈ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. హాస్య సన్నివేశాలతో ‘కృష్ణాంజనేయ యుద్ధం’ మహబూబ్నగర్ జిల్లా మైత్రీ కళా పరిషత్ కళాకారులు ప్రదర్శించిన కృష్ణాంజనేయ యుద్ధం నాటకం చక్కని హాస్యసన్నివేశాలతో అలరించింది. బలరాముడు, సత్యభామ, గరుత్మండుల గర్వభంగమే ఈ నాటి ప్రధాన సారాంశం. ఈ ముగ్గురి గర్వభంగం చేయడం కోసం శ్రీకృష్ణుడు ఆంజనేయున్ని పురమాయించడం, ఆంజనేయుడు, కృష్ణుడు మధ్యలో రసవత్తరమైన యుద్ధం జరగడం ఈ నాటకంలో ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. చక్కని వ్యవహార శైలిలో హాస్య సంభాషణలతో సాగిన ఈ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాండ్ర సుబ్రమణ్యం రచించిన ఈ నాటకానికి జగన్నాథరావు దర్శకత్వం వహించారు. -
'రుద్రమదేవి' తరువాత 'వీరాభిమన్యు'
రుద్రమదేవి సినిమాతో భారీ రిస్క్ చేసిన దర్శకుడు గుణశేఖర్, అదే స్థాయిలో మంచి విజయాన్ని సాధించాడు. ఎన్నో కష్టనష్టాలను దాటి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు వసూళ్ల పరంగాను మంచి రికార్డులనే నమోదు చేశాడు. ఇప్పుడు ఇదే జోష్ లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈసినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. రుద్రమదేవి సినిమా సమయంలోనే ఆ సినిమాకు సీక్వల్ తీసే ఆలోచన ఉందంటూ ప్రకటించాడు గుణశేఖర్. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆఖరి రాజు ప్రతాపరుద్రుడి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించాలని భావించాడు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని విమరమించుకొని మరో ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. చారిత్రక చిత్రంతో ఘనవిజయం సాధించిన గుణా టీం ఈ సారి పౌరాణిక గాథ మీద దృష్టిపెట్టింది. వీరాభిమన్యు పేరుతో మహాభారతంలోనే ఓ ఘట్టాన్ని సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట గుణశేఖర్. ఇప్పటికే అందుకు సంబందించి వీరాభిమన్యు అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. ఇదే పేరుతో శోభన్ బాబు కథనాయకుడిగా 1965లో ఓ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ప్రస్థుతం సాంకేతిక ఎన్నో మార్పులు వచ్చాయి కాబట్టి భారీగా ఈసినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. మరి ఈ పౌరాణిక కథతో వీరాభిమన్యుడిగా ఎవరు నటిస్తారో చూడాలి. -
మినీ సామాజిక విప్లవం
గ్రంథం చెక్క అనువాదాలతోను, అనుకరణలతోను ప్రారంభమైన నాటకసాహిత్యం తొలిరోజుల్లో కేవలం పాఠ్యంగా మాత్రమే ఉండేది. సమాజంలో ఆనాడు ఉన్న కట్టుబాట్లకు విరుద్ధంగా కొందరు సాహసికులు ఆ నాటకాలను రంగస్థలం మీద ప్రదర్శించడానికి పూనుకోవడం ఒక మినీ సామాజిక విప్లవం అని చెప్పవచ్చు. 1860-70 ప్రాంతాల్లో ఈ ఉద్యమం ప్రారంభమై అచిరకాలంలోనే అటు నటులను, ఇటు సామాజికులను కూడా ఆకట్టుకుంది. ఆంగ్ల, సంస్కృత అనువాదాలతో పాటు పౌరాణిక, చారిత్రక నాటకాలు రాయడం ప్రారంభమైంది. ప్రాంతీయ జానపద నాటకాల నుంచి కొంత, ఇంగ్లీష్ సంపర్కంతో 19వ శతాబ్దం చివరి దశకంలో భారతదేశానికి వచ్చిన ఆంగ్లనాటక బృందాల నుంచి కొంత అప్పు తెచ్చుకొని ప్రతి ప్రాంతీయ నాటకరంగం ఒక విధమైన సంగీత నాటకాన్ని పెంచుకుంది. పార్శీ నాటకరంగం, దాని ప్రభావంతో పెరిగిన పలు ప్రాంతీయ నాటకరంగాలు ఇటువంటివే! ఏదైనా వస్తువు జనాన్ని ఆకట్టుకుంటే దానిని ప్రజలకు అందించడానికి సిద్ధపడే వర్తకమ్మన్యులు తయారుగా ఉంటారు. అట్లా ఏర్పడ్డదే వ్యాపార నాటకరంగం. ఎక్కడెక్కడ ఏ మంచి నటులున్నా ఒక చోట చేర్చి, వాళ్లకి నెలజీతాలు ఇచ్చి, ఎక్కడెక్కడ ఏ మంచి ‘ట్రిక్’ దొరికినా దానిని తమ నాటకంలో చొప్పించి మంచి ‘మసాలా’ నాటకాలను ప్రజలకు అందించిన ఘనత వీళ్లదే! ఒకవైపు వ్యాపార నాటకరంగం, మరొకవైపు దానిలోని వ్యాపారతత్వాన్ని నిరాకరించి, విజయవంతంగా నాటకం ప్రదర్శించాలనే ధ్యేయంతో బయలుదేరిన వృత్తినాటకరంగం...రెండూ ప్రేక్షకుల మన్ననల్ని పొందాయి. - గిరీశ్ కర్నాడ్ ‘నాగమండలం’ (తెలుగు అనువాదం) నాటకానికి మొదలి నాగభూషణ శర్మ రాసిన ముందుమాట నుంచి.