డిసెంబర్‌లోనే రుద్రమదేవి | Rudhramadevi to release in December | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లోనే రుద్రమదేవి

Published Sat, Sep 6 2014 11:19 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

డిసెంబర్‌లోనే రుద్రమదేవి - Sakshi

డిసెంబర్‌లోనే రుద్రమదేవి

 తెలుగుజాతి వైభవానికి ప్రతీకగా నిలిచిన కాకతీయ చరిత్ర ఆధారంగా గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రమదేవి’. అనుష్క టైటిల్‌రోల్ చేసిన ఈ చిత్రంలో రానా, కృష్ణంరాజు, సుమన్, నిత్యామీనన్, కేథరిన్ ఇతర ముఖ్యభూమికలు పోషించగా, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రలో నటించారు. దేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ త్రీడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
 
 ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘తెలుగుజాతి చరిత్ర, తెలుగుజాతి సాహసం కళ్లకు కట్టే సినిమా ఇది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు అంతర్జాతీయ విజువల్ థ్రిల్‌కి గురిచేస్తుంది. అందుకే... రాష్ట్రంలోని పలు ఎగ్జిబిటర్లు ఈ సినిమా ప్రదర్శనకు అనుగుణంగా థియేటర్లను సిద్ధం చేసుకోవడం విశేషం. త్రీడీతో పాటు 2డీలో కూడా ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ చిత్ర నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
 
  పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ప్రకాశ్‌రాజ్, ప్రభ, ఆదిత్యమీనన్, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల, కెమెరా: అజయ్ విన్సెంట్, సంగీతం: ఇళయరాజా, కళ: తోట తరణి, కూర్పు: శ్రీకరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.రామ్‌గోపాల్, సమర్పణ: రాగిణి గుణ.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement