గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప' | Director Gunasekhars Next Project Hiranyakasyapa | Sakshi
Sakshi News home page

గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప'

Published Tue, Dec 13 2016 3:29 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప'

గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప'

రుద్రమదేవి సినిమాతో ఘన విజయం సాధించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్... మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. రుద్రమదేవితో భారీ చారిత్రక కథకు తెర రూపం ఇచ్చిన గుణ, ఇప్పుడు ఓ పౌరాణిక కథాంశాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. హిరణ్యకశ్యప పేరుతో ఓ భారీ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో అందరికి తెలిసిన భక్త ప్రహ్లాదుడి కథనే హిరణ్య కశ్యపుడి యాంగిల్లో ప్రెజెంట్ చేయనున్నాడట.

అందుకే ఈ సినిమాకు 'ద స్టోరి ఆఫ్ భక్త ప్రహ్లాద' అనే ట్యాగ్ లైన్ను యాడ్ చేశాడు. రుద్రమదేవి సినిమా తరువాత ప్రతాపరుద్రుడు అనే చారిత్రక చిత్రాన్ని రూపొందించనున్నట్టుగా ప్రకటించాడు. అయితే ప్రతాపరుద్రుడు కథకు మరింత రిసెర్చ్ చేయాల్సి ఉండటంతో ఆ సినిమాను వాయిదా వేసి హిరణ్యకశ్యపను తెర మీదకు తీసుకువచ్చాడు.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకోగా.. మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమాను స్వయంగా నిర్మించనున్నట్టుగా ప్రకటించాడు గుణశేఖర్. అంతేకాదు ఈ సినిమాలో హిరణ్యకశ్యపుడి పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కనిపించనున్నాడట. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నట్లుగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement