Hiranyakasyapa
-
రానాతో భారీ బడ్జెట్ మూవీ?
రుద్రమదేవి సినిమాతో సక్సెస్‌ను అందుకున్నారు దర్శకులు గుణశేఖర్. అయితే ఈ సినిమా విడుదలై చాలా కాలం అవుతున్నా.. ఇంకో సినిమాను తెరకెక్కించలేదు గుణశేఖర్. అప్పట్లో హిరణ్యకశ్యప సినిమాను తెరకెక్కించబోతున్నానని ప్రకటించారు ఈ డైరెక్టర్. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్‌పై అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను దాదాపు 180కోట్లతో నిర్మాత సురేశ్‌బాబు నిర్మించబోతున్నట్లు వినికిడి. రానా హిరణ్యకశ్యపుడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. -
వంద కోట్లతో గుణశేఖర్ సాహసం
రుద్రమదేవి సినిమాతో భారీ చారిత్రక చిత్రాన్ని వెండితెర మీద ఆవిష్కరించిన దర్శకుడు గుణశేఖర్ ఇప్పుడు మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే సినిమాను తెరకెక్కించనున్నట్టుగా గుణశేఖర్ ఇటీవల ప్రకటించాడు. ఈ పౌరాణిక గాథను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అంతేకాదు యంగ్ హీరో రానా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నాడన్న వార్తలు కూడా వినిపించాయి. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. హిరణ్యకశ్యప సినిమాను దర్శకుడు గుణశేఖర్ దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందించే ఆలోచనలో ఉన్నాడట. అయితే మార్కెట్ పరంగా గుణశేఖర్‌గాని, రానా గాని ఇంతవరకు వంద కోట్లమార్క్‌ను అందుకోలేదు. అందుకే అంత బడ్జెట్‌తో హిరణ్యకశ్యపను తెరకెక్కించటం సాహసమే అని భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ భారీ ప్రయోగంలో గుణ మరోసారి విజయం సాధింస్తాడేమో చూడాలి. -
గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప'
రుద్రమదేవి సినిమాతో ఘన విజయం సాధించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్... మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. రుద్రమదేవితో భారీ చారిత్రక కథకు తెర రూపం ఇచ్చిన గుణ, ఇప్పుడు ఓ పౌరాణిక కథాంశాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. హిరణ్యకశ్యప పేరుతో ఓ భారీ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో అందరికి తెలిసిన భక్త ప్రహ్లాదుడి కథనే హిరణ్య కశ్యపుడి యాంగిల్లో ప్రెజెంట్ చేయనున్నాడట. అందుకే ఈ సినిమాకు 'ద స్టోరి ఆఫ్ భక్త ప్రహ్లాద' అనే ట్యాగ్ లైన్‌ను యాడ్ చేశాడు. రుద్రమదేవి సినిమా తరువాత ప్రతాపరుద్రుడు అనే చారిత్రక చిత్రాన్ని రూపొందించనున్నట్టుగా ప్రకటించాడు. అయితే ప్రతాపరుద్రుడు కథకు మరింత రిసెర్చ్ చేయాల్సి ఉండటంతో ఆ సినిమాను వాయిదా వేసి హిరణ్యకశ్యపను తెర మీదకు తీసుకువచ్చాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకోగా.. మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమాను స్వయంగా నిర్మించనున్నట్టుగా ప్రకటించాడు గుణశేఖర్. అంతేకాదు ఈ సినిమాలో హిరణ్యకశ్యపుడి పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కనిపించనున్నాడట. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నట్లుగా తెలిపారు.