గుణశేఖర్కు సహాయకులు కావాలట..!
రుద్రమదేవి సినిమాతో ఆకట్టుకున్న గుణశేఖర్, ఆ సినిమా రిలీజ్ తరువాత కనిపించడం మానేశాడు. ఈ చారిత్రక చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో రూపొందించిన గుణ, సినిమా రిలీజ్ తరువాత మీడియాకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఆ తరువాత చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటి లాంటి విషయాలను కూడా ప్రకటించలేదు.
గుణ ప్రకటించకపోయినా.. రుద్రమదేవి సినిమా చివర్లో ప్రకటించినట్టుగా ప్రతాపరుద్రుడు సినిమాను తెరకెక్కిస్తారన్న టాక్ వినిపించింది. ఆ తరువాత రుద్రమదేవి సక్సెస్కు కారణమైన గోన గన్నారెడ్డి పాత్రను పూర్తి స్థాయిలో తెరకెక్కిస్తాడన్న మరో వార్త టాలీవుడ్లో హల్చల్ చేసింది. అయితే గుణశేఖర్ మాత్రం ఏ విషయాన్ని ప్రకటించలేదు. ఇప్పుడు కూడా సినిమాకు సంబందించి ఎలాంటి ప్రకటన చేయని గుణ, అప్రెంటీస్లు, అసిస్టెంట్లు కావాలంటూ ప్రకటించాడు.
తన తదుపరి చిత్రాల కోసం డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పని చేయడానికి అసిస్టెంట్లు కావాలంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు గుణ. త్వరలోనే గుణ తన కొత్త సినిమాకు సంబంధించిన పని మొదలెట్టే అవకాశం కనిపిస్తోంది. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
gteamworks.contact@gmail.com pic.twitter.com/WlxhnwJvi8
— Gunasekhar (@Gunasekhar1) February 3, 2016