Assistant Directors
-
వాళ్ల కష్టం ఎక్కువ.. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు: సాయిపల్లవి
ఇటీవల ఎక్కడ చూసినా సాయిపల్లవి పేరే వినిపిస్తోంది. అందుకు కారణం అమరన్ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనే.అందరి హీరోయిన్ల రూటు వేరు సాయి పల్లవి రూటు వేరని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ మాటను మరోసారి సాయిపల్లవి నిరూపించారు. కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న చాలామంది హీరోయిన్లు తమకు తక్కువగా పారితోషికం ఇస్తున్నారని గగ్గోలు పెట్టడం మనం చూశాం. కానీ సాయిపల్లవి మాత్రం అందుకు భిన్నంగా ఒక సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్న అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు. వారి కష్టానికి తగినంత పారితోషం ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు.సౌత్ ఇండియాలో సాయిపల్లవి పేరు ఎప్పటికీ ప్రత్యేకమే.. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఎలాంటి యాడ్స్ చేయనని చెప్పేస్తారు. కథకు అందులోని తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అది ఎంత భారీ చిత్రం అయినా, స్టార్ దర్శకుడు, కథానాయకుడు అయినా నో అనేస్తారు. ఇక పోతే స్కిన్ షో అనే విషయాన్నే దరిదాపులకు కూడా రానివ్వరు. అసలు మేకప్‌కు ప్రాముఖ్యతను ఇవ్వరు. అందుకే సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఇక విజయాల విషయానికి వస్తే ఈమె నటించిన అన్ని చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇక అమరన్ చిత్రంలోని తన నటనకు దర్శకుడు మణిరత్నం వంటి వారే ప్రశంసల జల్లు కురిపించారు. త్వరలో ఈమె నటుడు నాగచైతన్యతో జతకట్టిన తండేల్ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం రామాయణ అనే హిందీ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. అదేవిధంగా మరో హిందీ చిత్రం ప్రచారం జరుగుతోంది. తెలుగులోనూ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఇలా వరుసగా చిత్రాలు చేసుకుంటూ బిజీగా ఉన్న సాయిపల్లవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సహాయ దర్శకుల గురించి మాట్లాడారు. సహాయ దర్శకులకు వారి అర్హతకు తగిన వేతనాలు ఇవ్వడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్‌తో పోలిస్తే వేతనాలు చాలా తక్కువ తీసుకుంటున్న దర్శకులు మన చిత్ర పరిశ్రమంలో ఉన్నారని పేర్కొన్నారు. బాలీవుడ్లో ఒక చిత్రాన్ని చేసిన సహాయ దర్శకుడు వెంటనే మరో చిత్రానికి పనిచేయడానికి సిద్ధమవుతున్నారని, ఇది చాలా మంచి విషయమని అన్నారు. అయితే. దక్షిణాదిలో పరిస్థితి వేరు అని పేర్కొన్నారు వారి శ్రమకు, అర్హత తగిన వేతనం లభించడం, లభించకపోవడం బాధ కలిగిస్తోందని సాయిపల్లవి పేర్కొన్నారు. -
ఆర్జీవీ దగ్గర ఓనమాలు నేర్చుకున్న దర్శకులు వీళ్లే! (ఫోటోలు)
-
‘విక్రమ్’.. 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు కమల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్
Kamal Haasan Gifts New Bikes to 13 Assistant Directors: విక్రమ్ మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు హీరో కమల్ హాసన్. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో కమల్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో ప్రస్తుతం విక్రమ్ టీం, కమల్ హాసన్ మూవీ సక్సెస్‌ను ఆస్వాధిస్తున్నారు. విక్రమ్ మూవీ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో కమల్ హాసన్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌కు మంగళవారం ఖరీదైన లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు కోటీకి పైగా విలువ చేసే లెక్సాస్ లగ్జరీ కారును గిఫ్ట్గాఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. చదవండి: ‘విక్రమ్’ భారీ విజయం, దర్శకుడికి కమల్ లెక్సాస్ లగ్జరీ కారు బహుమతి అలాగే విక్రమ్ మూవీకి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చాడు కమల్ హాసన్. ఈ సినిమాకు పని చేసిన 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు అపాచీ ఆర్టీఆర్ 160 (Apache RTR 160)బైక్‌లను బహుమతిగా ఇచ్చాడు. ఈ ఒక్కో బైక్ ధర సుమారుగా రూ. 1.45 లక్షలు ఉంటుందని సమాచారం. కాగా విక్రమ్ మూవీ కోసం వీరు చాలా హర్డ్ వర్క్ చేశారని, వారి శ్రమ ఫలితమే మూవీ బాగా వచ్చిందని కమల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా అసిస్టెంట్ డైరెక్టర్లకు కమల్ బైక్ కీ అందిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్ డైరెక్టర్ విడుదలైన నాలుగు రోజుల్లో ఈ మూవీ దాదాపు రూ. 200 కోట్లు వసూళ్లు చేసింది. ఇక వీకెండ్స్‌లో (జూన్ 3 నుంచి 5 వరకు) అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో విక్రమ్ మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. ఇందులో కమల్ 67 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా యాక్షన్ సీన్స్ చేయడం విశేషం. https://t.co/zrQRWQN1Ta pic.twitter.com/dSi5jTXkVc — Ramesh Bala (@rameshlaus) June 7, 2022 -
గుణశేఖర్‌కు సహాయకులు కావాలట..!
రుద్రమదేవి సినిమాతో ఆకట్టుకున్న గుణశేఖర్, ఆ సినిమా రిలీజ్ తరువాత కనిపించడం మానేశాడు. ఈ చారిత్రక చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందించిన గుణ, సినిమా రిలీజ్ తరువాత మీడియాకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఆ తరువాత చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటి లాంటి విషయాలను కూడా ప్రకటించలేదు. గుణ ప్రకటించకపోయినా.. రుద్రమదేవి సినిమా చివర్లో ప్రకటించినట్టుగా ప్రతాపరుద్రుడు సినిమాను తెరకెక్కిస్తారన్న టాక్ వినిపించింది. ఆ తరువాత రుద్రమదేవి సక్సెస్‌కు కారణమైన గోన గన్నారెడ్డి పాత్రను పూర్తి స్థాయిలో తెరకెక్కిస్తాడన్న మరో వార్త టాలీవుడ్లో హల్చల్ చేసింది. అయితే గుణశేఖర్ మాత్రం ఏ విషయాన్ని ప్రకటించలేదు. ఇప్పుడు కూడా సినిమాకు సంబందించి ఎలాంటి ప్రకటన చేయని గుణ, అప్రెంటీస్‌లు, అసిస్టెంట్లు కావాలంటూ ప్రకటించాడు. తన తదుపరి చిత్రాల కోసం డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పని చేయడానికి అసిస్టెంట్లు కావాలంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు గుణ. త్వరలోనే గుణ తన కొత్త సినిమాకు సంబంధించిన పని మొదలెట్టే అవకాశం కనిపిస్తోంది. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. gteamworks.contact@gmail.com pic.twitter.com/WlxhnwJvi8 — Gunasekhar (@Gunasekhar1) February 3, 2016