Gona Ganna Reddy
-
గుణశేఖర్‌కు సహాయకులు కావాలట..!
రుద్రమదేవి సినిమాతో ఆకట్టుకున్న గుణశేఖర్, ఆ సినిమా రిలీజ్ తరువాత కనిపించడం మానేశాడు. ఈ చారిత్రక చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందించిన గుణ, సినిమా రిలీజ్ తరువాత మీడియాకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఆ తరువాత చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటి లాంటి విషయాలను కూడా ప్రకటించలేదు. గుణ ప్రకటించకపోయినా.. రుద్రమదేవి సినిమా చివర్లో ప్రకటించినట్టుగా ప్రతాపరుద్రుడు సినిమాను తెరకెక్కిస్తారన్న టాక్ వినిపించింది. ఆ తరువాత రుద్రమదేవి సక్సెస్‌కు కారణమైన గోన గన్నారెడ్డి పాత్రను పూర్తి స్థాయిలో తెరకెక్కిస్తాడన్న మరో వార్త టాలీవుడ్లో హల్చల్ చేసింది. అయితే గుణశేఖర్ మాత్రం ఏ విషయాన్ని ప్రకటించలేదు. ఇప్పుడు కూడా సినిమాకు సంబందించి ఎలాంటి ప్రకటన చేయని గుణ, అప్రెంటీస్‌లు, అసిస్టెంట్లు కావాలంటూ ప్రకటించాడు. తన తదుపరి చిత్రాల కోసం డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పని చేయడానికి అసిస్టెంట్లు కావాలంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు గుణ. త్వరలోనే గుణ తన కొత్త సినిమాకు సంబంధించిన పని మొదలెట్టే అవకాశం కనిపిస్తోంది. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. gteamworks.contact@gmail.com pic.twitter.com/WlxhnwJvi8 — Gunasekhar (@Gunasekhar1) February 3, 2016 -
గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్!
-
కాకతీయ పౌరుష ఖడ్గధారిగా...
తెలుగు జాతి చరిత్రలో ఓ ముఖ్య అధ్యాయమైన కాకతీయ సామ్రాజ్య వైభవంలోని కీలక ఘట్టం ‘రుద్రమదేవి’ జీవితం. ఈ ఉత్తేజపూరిత గాథను ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి దర్శక - నిర్మాత గుణశేఖర్ తెర మీదకు వస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో చారిత్రక కథాంశంతో రూపొందుతోన్న తొలి స్టీరియోస్కోపిక్ త్రీడీ చిత్రమైన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో కథానాయిక అనుష్క ‘రుద్రమదేవి’గా టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. కాగా, హీరో అల్లు అర్జున్ కూడా ఈ చిత్రంలో కీలక భాగస్వామి. తెలుగు జాతి పౌరుషానికీ, కాకతీయ వీరఖడ్గానికి ప్రతీకగా కథలో కీలకంగా వచ్చే చరిత్ర ప్రసిద్ధుడైన గోన గన్నారెడ్డి పాత్రను ఆయన పోషించారు. ఆయన ధరించిన ఆ పాత్ర తెరపై ఎంత గొప్పగా ఉంటుందోనన్న ప్రేక్షకుల ఆసక్తిని మరికొంత పెంచుతూ, శనివారం నాడు గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ తొలి ప్రచార ఛాయాచిత్రాన్ని విడుదల చేశారు. ‘‘నలభై రోజుల పాటు అల్లు అర్జున్‌పై కీలక సన్నివేశాలు తీశాం. పీటర్ హెయిన్ ఆధ్వర్యవంలో పోరాట దృశ్యాలు చిత్రీకరించాం. యువతరాన్నీ, మాస్ ప్రేక్షకులనూ ఆకర్షించే గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ అద్భుతంగా పోషించారు’’ అని గుణశేఖర్ వివరించారు. రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాశ్‌రాజ్, నిత్యామీనన్, క్యాథరిన్, ప్రభు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత సారథి. తోట తరణి కళా దర్శకులు. అజయ్ విన్సెంట్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ కూర్పు నిర్వహిస్తున్నారు. ‘‘గోన గన్నారెడ్డి పాత్రధారి అల్లు అర్జున్‌పై తీసిన ముఖ్య సన్నివేశాలు సినిమాకు పెద్ద బలం’’ అని గుణశేఖర్ ఢంకా బజాయిస్తున్నారు. -
లుక్ మార్చిన స్టైలీష్ స్టార్
-
హిస్టారికల్ మూవీలో బన్ని డ్యూయెట్
-
గోన గన్నారెడ్డిగా ఎన్టీఆర్..?